జగన్ ఇలాకాలో ప్రభుత్వ సలహాదారులకు కొదవేలేదు. తాజాగా మరో సలహాదారు వచ్చి చేశారు. ఆయనే గడికోట శ్రీ కాంత్ రెడ్డి. రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన నిన్నటి వరకూ చీఫ్ విప్ గా పనిచేశారు. తాజాగా ఆయన్ను సభా వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రి సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవిని అప్పగించారు. ఇకపై ఆయన శాసన సభ, శాసన మండలి సమన్వయకర్తగా వ్యవహరిస్తూనే, ముఖ్యమంత్రి సలహాదారుగానే కొనసాగుతారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకూ అమల్లోనే ఉండనున్నాయి.
శాసన సభ, శాసన మండలి సమావేశాలు సజావుగా జరిగేందుకు శ్రీకాంత్ రెడ్డి ఇకపై కృషి చేయాల్సి ఉంటుంది..అని, అదేవిధంగా సభా నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రికే కాదు ఆయన కార్యాలయానికీ సలహాదారుగా ఉండనున్నారు అని ప్రధాన మీడియా చెబుతోంది. ఎపార్ట్ ఫ్రమ్ దిస్.. ఎప్పటి నుంచో విధేయుడిగా ఉన్న గడికోటకు మొన్నటి వేళ మంత్రి వర్గ విస్తరణలో చోటు వస్తుందని ఆశించారు. ఆయనకే కాదు వీరవిధేయులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డి కి కూడా పదవులు వస్తాయనే అనుకున్నారు.
అయితే సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా రెడ్ల ను తగ్గించి మిగిలిన వారికి అవకాశాలు ఇచ్చి ఆ మేరకు అందరినీ సంతృప్తి పరిచాం అన్న మాట ఒకటి జనంలోకి తీసుకువెళ్లేందుకు జగన్ ఎక్కువగా తన సొంత సామాజికవర్గ మనుషులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ వారికి క్యాబినెట్ హోదాతో కూడిన పదవులు ఇవ్వడం మాత్రం ఇప్పుడు సంచలనం అవుతోంది. ఇప్పటికే తన సొంత మనుషులు అయిన సజ్జల లాంటి వారికి కూడా కేబినెట్ ర్యాంక్ ఉంది. ఇప్పుడు మరో కొత్త సలహాదారుల చేరికతో ఉభయ చట్ట సభల నిర్వహణలో మార్పు ఉండనుందా లేదా ఇదొక కంటి తుడుపు చర్యలాంటిదేనా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.
Comments 1