కేసీఆర్ కు అదిరే బహుమతి ఇచ్చిన ఆంధ్రావాసి

పుట్టినరోజులు ప్రతి ఏడాది వచ్చి పోతుంటాయి. కానీ.. అందుకు భిన్నంగా.. గతంలో మరెప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును భారీ ఎత్తున ఈ రోజు (బుధవారం) నిర్వహిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా పోటాపోటీగా నిర్వహిస్తున్న కార్యక్రమాల చిట్టా చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. దేశంలోని ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా.. పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమాల చిట్టా భారీగా ఉండటమే కాదు.. కోట్లాది రూపాయిల్ని ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా ఏపీ వాసి ఒకరు సిద్దం చేసిన పుట్టిన రోజు బహుమతి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. చూసినంతనే వావ్ అనుకోకుండా ఉండలేనట్లుగా రూపొందించారు. ఇంతకూ వారెవరు? ఏం చేశారన్న విషయంలోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పల్ల సత్తిబాబు.. పల్ల సుబ్రహ్మణ్యం.. పల్ల గణపతిలు కలిసి వివిధ రంగుల పూలు.. పూల మొక్కలతోకలిసి కేసీఆర్ చిత్రపటాన్ని క్రియేటివ్ గా రూపొందించారు.
కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రికి వినూత్నంగా పుట్టినరోజు బహుమతి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ తీరులో కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
తమ రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ అధినేత పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూల బొమ్మ.. పలువురిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ తరహా ఇమేజ్ కేసీఆర్ కు మాత్రమే సొంతమేమో?


Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.