రాజకీయాల్లో ఒకరి వీక్ నెస్‌ను మరొకరు బయట పెడతారు. లేదాప్రత్యర్థులు బయట పెట్టి యాగీ చేస్తారు. రాజకీయాల్లో ఇది సహజం. అయితే.. ఇప్పుడు తన వీక్నెస్ను వైసీపీనే బయట పెట్టుకుందని అంటు న్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ నాయకులు విజయం దక్కించుకున్నా రు.
మిగిలిన వాటిలో 23 టీడీపీ,ఒకటి జనసేన దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు వైసీపీ అధిష్టానం దాదాపు 60 స్థానాల్లో వీక్‌గా ఉన్నట్టు గుర్తించింది. వాస్తవానికి పీకే టీంతో చేయించిన సర్వేలో 70 స్థానాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్టు తేలింది.
దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని.. సలహా ఇచ్చారట.. పీకే. కానీ, జగన్ మాత్రం 60 స్థానాల్లో నే మార్పులకు రెడీ అయ్యారట. దీనిని బట్టి.. చూస్తే.. గతంలో ఓడిపోయిన 23 స్థానాలను కలుపుకొంటే.. మొత్తం 83 స్థానాల్లోనూ వైసీపీకి ఇబ్బందులు ఉన్నట్టుగా పరిగణించాలి.
ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే చాలా చోట్ల వివాదాలు జరుగు తున్నాయి. వచ్చే ఎన్నికల మాట ఎలా ఉన్నప్పటికీ.. నేతలు తమలో తాము వివాదాలు పడుతున్న పరి స్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుందనే సంకేతాలు వస్తున్నాయి. అంతేకాదు.. వాస్తవా నికి.. గత ఎన్నికల్లో జగన్ సునామీ కారణంగా.. టీడీపీ కంచుకోటల్లో కూడా వైసీపీ అభ్యర్థులు విజయం ద క్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ.. టీడీపీ పుంజుకునే పరిస్థితి కనిపిస్తోం ది. ఈ క్రమంలో దీటుగా వైసీపీ నాయకులు పోటీ ఇవ్వలేక పోతున్నారనేదివాస్తవం. వీరిలో మంత్రులు కూడా ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 20 వరకు ఉన్నాయి.
ఉదాహరణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, గుంటూరులోని వేమూరు.. వంటి నియోజక వర్గాలు వున్నాయి. అదేసమయంలో రాజంపేట వంటి కీలక నియోజకవర్గంలోనూ మార్పులు కనిపిస్తు న్నాయి. వీటన్నింటిపైనా.. జగన్‌కు సమాచారం ఉందని.. సర్వేల ఆధారంగా.. ఆయన కీలక నేతలను మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక, వీరిలో తప్పదు అనుకున్నవారిని మినహా.. మిగిలిన వారికి దాదాపు శ్రీముఖమేనని సమాచారం.
ఇక, ఎంపీల విషయానికి వస్తే.. ఇక్కడకూడా మార్పులు తప్పవనే సమాచారం ఉంది. సుమారు 22 మంది లో రెబల్ రఘురామను పక్కన పెడితే.. మిగిలిన 21 మందిలో దాదాపు 9 నుంచి 10 మంది వరకు ఎంపీ అభ్యర్థులను మారుస్తారని తెలుస్తోంది. వీరిలో ఆది నుంచి వినిపిస్తున్న నియోజకవర్గాలు.. అరకు, బాప ట్ల, కడప, హిందూపురం, శ్రీకాకుళం వంటివి ప్రముఖంగా ఉన్నాయి. మొత్తంగా.. పరిస్థితి చూస్తే.. వైసీపీలో పెనుమార్పులు ఖాయమనే సంకేతాలు వ్యక్తం అవుతుండడం గమనార్హం.