• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కరోనా వేళ కుంభమేళాలో అమిత్ షా, యోగి…రియలా? వైరలా?

అమిత్ షా రూల్స్ పెడతారు...కానీ పాటించరంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్

admin by admin
April 17, 2021
in India, Trending
0
0
SHARES
215
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కరోనా గిరోనా లేదు…కుంభమేళా వచ్చేయ్ బ్రదర్…హరిద్వార్ నగరంలో వీధి వీధి నాదే బ్రదర్…గంగలో మునకేసి కాషాయం కట్టేయ్ బ్రదర్….చదవడానికి కొంచెం వెటకారంగా ఉన్నా…ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. కరోనా నిబంధనలు పాటించాలని చెబుతోన్న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి సైతం కరోనా నిబంధనలు గాలికి వదిలేసి గుంపులో గోవిందలాగా 20 మంది సాధువులతో కలిసి గంగలో మునకేశారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో, అమిత్ షా, యోగిలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూలు ఆంక్షలు పెడుతుంటే…బాధ్యతగా ఉండాల్సిన షా మాత్రం నిర్లక్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎదుటి మనిషికి చెప్పేందుకే రూల్స్ ఉన్నాయని…పాటించేందుకు కాదని షా నిరూపించారని ట్రోలింగ్ జరుగుతోంది. ఇక, కుంభమేళాలో పాల్గొన్న యోగి కరోనా బారిన పడిన సంగతిపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది…కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నెటిజన్లు ట్రోల్ చేయడానికి అవకాశమిచ్చిన షా, యోగిల ఫొటో…ఈ ఏడాది కుంభమేళాలోది కాదు. 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభమేళాలో షా, యోగి పాల్గొన్న ఫొటోను కొందరు ఈసారి కుంభమేళాకు జోడించి వైరల్ చేశారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుండడం…కుంభమేళా కొనసాగిస్తామంటూ ప్రకటన చేయడం నేపథ్యంలో చాలామంది నెటిజన్లు కూడా ఈ ఫొటో నిజమనుకొని నమ్మేశారు.

అందుకే,సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులలో ఏది రియల్?  ఏది వైరల్ ? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. గత ఏడాది కరోనా సూపర్ స్ప్రెడర్ అంటూ ఢిల్లీలోని మర్కస్ మస్జిద్ ఎపిసోడ్ కు అనుబంధంగా వచ్చిన కొన్ని ఫొటోలు, వార్తలు కూడా ఫేక్ అని అనేక వార్తా సంస్థలు, ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికే ఓ వర్గంవారికి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. అందుకే, సోషల్ మీడియాలో ఏది రియల్ ఏది వైరల్ అని తెలుసుకొని షేర్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: amit shahkumbhamelaparticipationreal or viralyogi adityanath
Previous Post

కరోనా విషయంలో నటుడు ఆదర్శ్ ఆదర్శం పనికిరాలేదా?

Next Post

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ మృతిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Related Posts

ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Trending

అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు

March 20, 2023
viveka murder case
Trending

ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌

March 20, 2023
Trending

ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

March 20, 2023
Load More
Next Post

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ మృతిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే
  • చంద్ర‌బాబు వైరల్ కామెంట్స్‌

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra