No Result
View All Result
- ప్రధాని మోదీ కుడి భుజం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్, మునుగోడు పర్యటన తెలంగాణ రాజకీయాల్లోనే కాకపెంచుతోంది అనుకుంటే సడన్‌గా ఆయన తీసుకున్న నిర్ణయంతో ఏపీ రాజీకీయాల్లోనూ వేడి రాజుకుంది.
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ లో చేరడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమై నోటిఫికేషన్ రావడానికే ముందే ప్రచార తీవ్రత పెరిగిపోయింది. అందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు మునుగోడు వస్తున్నారు.
మునుగోడు వెళ్లడానికి ముందు ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయితే… మునుగోడులో బహిరంగ సభలో పాల్గొన్న తరువాత ఆయన ఈ రోజు రాత్రికి సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కానున్నారు. ఈ విషయం ఈ రోజే బయటపడడంతో ఏపీ రాజకీయాల్లోనూ వేడి పెరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరుతారా.. లేదంటే బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారా వంటి ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి.
- అనసూయ భలే ఇరుక్కుందే…
- సూపర్ : మూడు రాజధానుల భ్రమలకు త్వరలో తెర !
కాగా అమిత్ షా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ తదితరులు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న అమిత్ షా అక్కడ పూజలు చేశారు. గుడిలో దాదాపు అరగంట ఉన్నారు.
అనంతరం సికిందరాబాద్ సాంబమూర్తి నగర్‌కి చెందిన సత్యనారాయణ అనే దళిత కార్యకర్త ఇంటికి వెళ్లారు. కార్యకర్త ఇంట్లో టీ తాగిన అమిత్ షా పావు గంట తర్వాత బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు.
అక్కడ రైతు సంఘం నాయకులతో అమిత్ షా కలిశారు. అక్కడి నుంచి మునుగోడు బయలుదేరారు.
మునుగోడులోనే సీఆర్పీఎఫ్ పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం బీజేపీ బహరంగ సభలో పాల్గొంటారు.
సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అవుతారు.
సాయంత్రం 8 గంటల సమయానికి అమిత్ షా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి విందు సమావేశం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అమిత్ షాను కలుస్తారు.
అమిత్ షా ఇటీవల RRR సినిమా చూశారని, జూనియర్ ఎన్టీఆర్ నటన నచ్చి ఆయనను కలవటానికి ఆహ్వానించారని చెప్తున్నప్పటికీ వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత కనిపిస్తోంది.
No Result
View All Result
Comments 2