నా ఆమరణ నిరాహార దీక్ష మరియు నిరసన “మోడీ ప్రభుత్వ నిరంకుశత్వం, దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలన మీద మరియు అత్యంత నేరపూరిత, దోపిడీ జగన్ రెడ్డి ప్రభుత్వాల మీద వివరణాత్మక సందేశం”!
తేదీ: 25 ఫిబ్రవరి 2021
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
నా ఆమరణ నిరాహార దీక్ష పదమూడు రోజులకు చేరింది.
మొన్న మంగళవారం రోజు నా ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది. కానీ, నాకు ఏవిధమైన రక్త సంబంధ సమస్యలు తలెత్తలేదు.
ప్రస్తుతం చాలా నీరసంగా, నిస్సత్తువగా ఉంది. నా బ్లడ్ షుగర్ 100 మి.గ్రా పైకి చేరింది. బ్లడ్ ప్రెజర్ 90 మి.గ్రా లకు చేరింది.
ఈ ఆమరణ నిరాహారదీక్ష ఆపదలుచుకోలేదు.
ప్రతి సగటు భారతీయుడికి ప్రభుత్వాల్ని ప్రశ్నించగల ధైర్యం ఇవ్వటం కోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను.
ప్రజలు ప్రశ్నించటం అంటే.. ప్రభుత్వాల నుంచి జవాబుదారితనం ఆశించడం.
★ ఉదాహరణ: అమరావతి రాజధాని రైతులు చదువులేని మోడీ.. చదువురాని క్రిమినల్ జగన్ రెడ్డి అరాచకాల మీద, అన్యాయాల మీద ఆర్జీ పంపితే సమాధానం మరియు పరిష్కారం ఇవ్వాలి. కానీ.. ఇవ్వటం లేదు. అందుకే మోడీ రాజీనామా చేయాలి మరియు మీరంతా కలిసి వత్తిడి చేస్తే జగన్ రెడ్డి బెయిల్ రద్దవుతుంది. అంతటి శక్తిని ప్రజలకు ఇవ్వటం కోసమే నా ఆమరణ నిరాహార దీక్ష.
ఇండియాలో మరియు తెలుగు రాష్ట్రాలలో ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించే వరకు వరకు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ద్వారా జరిగే ఎన్నికల విధానం శాశ్వతంగా రద్దు చేసే వరకు, ఇండియాలో పోలీసుల దమనకాండ అంతం అయ్యే వరకు, అమరావతి రైతులకు మరియు భారతదేశ రైతులకు న్యాయం జరిగే వరకు, సంఘ్ పరివార్ మరియు మోడీ ప్రభుత్వ అరాచకాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగే వరకు, అత్యంత నేరస్తుడైన జగన్ రెడ్డి బెయిల్ రద్దు వరకు ఈ నిరాహర దీక్ష కొనసాగుతుంది.
మళ్లీ భారత రాజ్యంగం ప్రకారం నడిచే ప్రభుత్వాలు రావాలి.
ఈ ప్రక్షాళన, భారతీయులలో మార్పును కోరుకొంటున్న సగటు ప్రవాస భారతీయుడిని నేను.
మీ శ్రేయస్సు కోరుకునే…
డాక్టర్. ఉయ్యూరు లోకేష్ బాబు.
భారతదేశం. (అమెరికా నివాసి)