ఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఎస్సీలకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నార ని.. కనీసం కేబినెట్లోనూ చర్చించకుండానే.. జీవో 41 ద్వారా వీటిని గత చంద్రబాబు ప్రభుత్వం లాక్కుం దనని ఆరోపిస్తూ.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉరఫ్ ఆర్కే.. సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఐడీ అధికారులు.. మాజీ సీఎం చంద్రబాబుకు.. అప్పటి మంత్రి.. నారాయ ణకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే.. దీనిపై చంద్రబాబు హైకోర్టుకువెళ్లడంతో ప్రస్తుతం స్టే కొనసాగుతోంది.
కానీ.. ఇప్పుడు ఈ కేసు విషయంలో ఆర్కే చుట్టూ.. ఉచ్చు బిగిస్తోందని అంటున్నారు న్యాయనిపుణులు. ఆర్కే విషయానికి వస్తే.. తనవద్దకు కొందరు బాధితులు వచ్చారని.. గత చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై తమకు సాయం చేయమని కోరినట్టు ఆర్కే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను సీఐ డీకి ఫిర్యాదు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. తాజాగా టీడీపీ నేతలు ఈవిషయంలో కొన్ని సంచ లన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. ఎవరి పేర్లతో అయితే.. ఆర్కే ఫిర్యాదు చేశారో.. ఎవరికైతే అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారో.. వారెవరూ కూడా తాము ఆర్కే వద్దకు వెళ్లలేదని స్పష్టం చేయడం గమనార్హం.
సీఐడీకి ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని, ఈపూరి సుబ్బమ్మ, అద్దేపల్లి సాంబశివరావు తదితరులు సంచలన విషయాలు బయటపెట్టారు. కందా పావని మాట్లాడుతూ.. కేసు తాము పెట్టలేదని తెలిపారు. విచారణ పేరుతో తమ వద్దకు కొందరు వచ్చారని, భూమి అమ్మారా లేదా అని నిర్ధారించుకుం టున్నామంటూ సంతకాలు పెట్టించుకున్నారన్నారు. తాను ఓసీ అని చెప్పారు. భూమి తాము అమ్ముకు న్నామని నిర్ధారిస్తున్నామంటే సంతకం చేశామన్నారు. దాన్ని కేసుగా నమోదు చేశారని చెప్పారు. కేసు కోసం అంటే అసలు సంతకాలే పెట్టేవాళ్ళం కాదన్నారు.
అద్దెపల్లి సాంబశివరావు మాట్లాడుతూ.. సీఐడీ వాళ్లు వచ్చారు. మీరు పొలం ఇచ్చారా అని అడిగితే అమ్మినట్టు చెప్పామన్నారు. కొనుక్కున్న వ్యక్తి తనకు మళ్లీ భూమి ఇవ్వలేదని, పార్టీ అంశమే తమ దగ్గరకు రాలేదన్నారు. బలవంతంగా లాక్కురన్న మాటలేదన్నారు. బలవంతంగా లాక్కున్నారా అని అడిగారు. అదేమీ లేదని చెప్పామని, కొన్నవాళ్లు ఇస్తారేమోనని అడిగామని, కానీ ఇవ్వలేదన్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా జరిగిందే చెప్పామన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు వెలుగులోకి రావడంతో ఆర్కే చుట్టు.. రిమార్కు రాజకీయం చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఎదురు ఆయనపైనే కేసు వేసేందుకు టీడీపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.