అక్కినేని అఖిల్ గురించి ఓ సందర్భంలో అభిమాని చాలా ఎమోషనల్‌గా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయింది.
అయ్యగారే నంబర్ వన్.. ఆడే కరెక్ట్.. ఆడే రావాలి.. అంటూ ఆ ఫ్యాన్ చాలా ఆవేశంతో మైకు ముందు అరుస్తుంటాడు ఆ వీడియోలో. ఆ అభిమాని పేరేంటో కూడా జనాలకు తెలియదు కానీ.. మూడు సినిమాలు చేసినా ఒక్క హిట్టు కొట్టలేక సతమతం అవుతున్న అఖిల్ గురించి అంత ఎగ్జైట్ కావడమేంటో అని అందరూ ఆశ్చర్యపోయి చూశారు అప్పట్లో.
A small video of #Ayyagaru journey as a fan of @AkhilAkkineni8 💥 Thanks to #AkhilAkkineni for recognising ur fan ❤❤ Please meet him soon…. #MostEligibleBachelor #MEB pic.twitter.com/oaqbktRq6I
— MR Solo 2.0 (@SolidLover123) October 18, 2021
తర్వాత మీమ్స్ కోసం చాలామంది ఈ అభిమాని వీడియో, ఫోటోను వాడుకున్నారు.ఆ అభిమాని స్పందన తర్వాత అఖిల్‌ను సోషల్ మీడియా జనాలు అయ్యగారు అనడం మొదలైంది. ఇంతగా పాపులర్ అయిన ఆ ఫ్యాన్ చాన్నాళ్ల తర్వాత ఇటీవలే అఖిల్ కొత్త చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో కనిపించాడు.
ఓ థియేటర్ ముందు అఖిల్ పోస్టర్‌కు బొట్టు పెట్టి కొబ్బరికాయ కొడుతున్న అతడి వీడియో వైరల్ అయింది. ఐతే ఈ అభిమాని గురించి ఇప్పుడు అఖిల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించడం విశేషం. అయ్యగారు అనే పదం ఎప్పుడైనా విన్నారా అని అడిగితే.. అఖిల్ చాలా సిగ్గుపడిపోయాడు.
ఆ వ్యక్తి గురించి తాను మాట్లాడి తీరాలని.. తన పట్ల ఇంత అభిమానం ఉన్న ఫ్యాన్ ఉండటం తన అదృష్టమని అన్నాడు అఖిల్. సోషల్ మీడియాలో తన మీద ట్రోల్స్ నడుస్తున్న సమయంలో ఈ వీడియో వైరల్ అయిపోయి.. ఒక పాజిటివిటీని తీసుకొచ్చిందని అఖిల్ అన్నాడు.
తనకంటే కూడా ఆ అభిమాని పాపులర్ అయిపోయాడని… అతను బాగుండాలని తాను కోరుకుంటున్నానని.. త్వరలో అతణ్ని కలవాలనుకుంటున్నానని కూడా అఖిల్ చెప్పడం విశేషం. మరి అఖిల్ మాటలు విన్న ఆ అభిమాని ఎంత ఎగ్జైట్ అయిపోతాడో. మొత్తానికి త్వరలో అఖిల్, ఆ అభిమాని కలయికను చూడబోతున్నామన్నమాట.
I’m happy that my fan has become more popular. I would love to meet him soon – Akhil Akkineni on Instagram live about #Ayyagaru fan.#MostEligibileBachelor pic.twitter.com/CBBlwgzrRt
— Nandamuri Abhimani (@ntr_chalapathi) October 18, 2021