ఎయిమ్స్ – ఢిల్లీ ఛీఫ్ రణదీప్ గులేరియా మరో ప్రమాదం గురించి దేశాన్ని హెచ్చరించారు. ఇండియాకు మూడో వేవ్ ముప్పు కచ్చితంగా ఉందన్నారు. అయితే, మూడో వేవ్… తీవ్రంగా ఉండకపోవచ్చన్నారు.
రెండో వేవ్ విషయంలో నిర్లక్ష్యపూరితంగా ఉండటం ఒకటైతే వేరియంట్ కూడా చాలా ప్రభావవంతమైనది కావడం వల్ల ఇంత నష్టం వాటిల్లిందన్నారు.
మూడో వేవ్ నాటికి అత్యధిక మందికి వ్యాక్సిన్లు అంది ఉంటాయని కాబట్టి… ముప్పు తక్కువగా ఉండచ్చన్నారు. అయితే, మన రోగ నిరోధక శక్తిని అధిగమించే స్థాయిలో కరోనా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదన్నారు.
కంటి తుడుపు లాక్ డౌన్లు వద్దు
రణదీప్ లాక్ డౌన్ల విషయంలో ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయన్నారు. రాత్రి కర్ఫ్యూల వల్ల ప్రయోజనం ఉండదన్నారు. వారాంతపు లాక్ డౌన్ల వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదన్నారు. రెండు వారాల కఠిన లాక్ డౌన్ వల్ల ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు.