సంధ్య థియేటర్ ఇష్యూను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఎటువంటి నేరం చేయకపోయినా ఈ ఘటనలో ఆయనే బాధ్యుడిగా నిలిచారు. దీనికి తోడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కి గట్టి చురకలు వేశారు. ఇకపై టికెట్ రేట్ల పెంపుకు మరియు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే సినీ పెద్దలు రేవంత్ రెడ్డితో భేటీ కావడం కూడా జరిగింది. అయినా సరే బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు నో అంటే నో అనేసారు. అలాగే ఈ సందర్భంగా టాలీవుడ్ ఎదుట కొన్ని ప్రతిపాదనలు పెట్టారు.
సినీ పెద్దలు సైతం ఇండస్ట్రీ ఎందుర్కొంటున్న సమస్యలను మరియు పలు ప్రతిపాదనలు సీఎం ఎదుట ఉంచారు. ఇక ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి పై ప్రముఖ హీరోయిన్ మాధవీలత ఫైర్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీ లత.. ఒక వీడియో ద్వారా రేవంత్ రెడ్డికి కొన్ని సూటి ప్రశ్నలను సాధించింది.
`రేవంత్ రెడ్డి సార్ ను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నా.. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రీసెంట్ గా మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారు. ఈ విషమంపై అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ, అక్బరుద్దీన్ ప్రశ్నిస్తారా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అబ్బాస్ తప్పు చేశాడు.. శిక్ష విధించండి.. దీనిపై ఏమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతారా?` అంటూ మాధవీ లత ప్రశ్నించింది.
కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుని.. దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే అని చెప్పి లెటర్ రాసి పెట్టి మరీ చనిపోయాడు. మరి వాళ్ల కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చారా? కనీసం రూ. 25 వేలు అయినా ఇచ్చారా? అని మాధవీ లత ప్రశ్నించింది. ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. పొద్దు తిరుగుడు పువ్వు ఎట్ట తిరిగితే.. ఆయన కూడా అట్ట తిరుగుతాడంట. మరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు ఇంటికెళ్లి, కుటుంబ సభ్యులని పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అని మాధవీ లవ ప్రశ్నలు సంధించింది.
అల్లు అర్జున్ చేసింది నేరం కాదు.. ఆయనకి తెలియకుండా జరిగిపోయింది. ఆ ఇష్యూపై సరిగ్గా రియాక్ట్ కాకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంటుంది. ఆయన కూడా సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి విధులు, హక్కులు వర్తిస్తాయో ఆయనకీ అవే వర్తిస్తాయి అని మాధవీ లత చెప్పుకొచ్చింది. జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మొత్తంపై ఉక్కు పాదం మోపాలి, వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారంటూ మండిపడింది.
జగన్ సినిమా వాళ్లందర్నీ పిలిపించుకుని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు.. మనం సీఎం అయ్యాక ఎందుకు చేయించుకోకూడదని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని మాధవీ లత ఫైర్ అయింది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఎన్నో సాధించారు. మరెందుకు ఇంత గలీజుగా బిహేవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్? అంటూ ప్రశ్నించింది.
గురుకుల పాఠశాలల్లో ఎందరో విద్యార్థలు చనిపోతే ఏనాడైనా మాట్లాడారా? అందరికీ సమానంగా స్పందించండి. దిల్ రాజును అడ్డం పెట్టుకొని సినిమా వాళ్లపై పెత్తనం చెలయించాలని చూస్తున్నారు. వాళ్లైనా ఏం చేస్తారు.. అంతా వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అంటూ మాధవీ లత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మాధవీ లత తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.