ప్రస్తుతం సినీ పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతోంది. స్టార్ కపుల్స్ వరుస పెట్టి విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా గుర్తింపు పొందిన సమంత, నాగ చైతన్యలు ఇటీవలె తమ వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్ వేశారు.పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే వీరిద్దరూ విడిపోవడంతో అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
సామ్-చైల తర్వాత బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చారు. మొన్నటికి మొన్న కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు సైతం తాము విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు వీరి బాటలోనే మరో టాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమవుతోంది. వారెవరో కాదు జె.డి. చక్రవర్తి- అనుకృతి గోవింద్ శర్మ.
`శివ` సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జె.డి. చక్రవర్తి.. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించిన జె.డి లక్నోకి చెందిన అనుకృతి గోవింద్ శర్మ ను 2016లో వివాహం చేసుకున్నాడు.
అనుకృతి ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా, జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన `శ్రీదేవి` సినిమాలో నటించిన హీరోయిన్. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారడంతో.. అనుకృతి, జె.డి.చక్రవర్తిలు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, ఇప్పుడు వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగడం లేదని.. దీంతో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.