దేశంలో రాజధాని లేని అత్యంత దురదృష్టకరమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ప్రజల్లో ఆవేదన లేకుండా చేయాల్సిన ప్రభుత్వం ఎంత ఆవేదన అయినా పడండి బయటు మాత్రం చెప్పకండి అన్నట్టు ప్రవర్తిస్తోంది.
ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎంత నొప్పి కలిగినా మూసుకుని ఉండాలి గాని బయటకు చెప్పకూడదు.
బయటకు చెబితే కుల ముద్ర, బెదిరింపులు, కేసులు ఉంటాయి.
అన్నిటికీ తెగించి ముందుకు వచ్చే వాళ్లే రాష్ట్రంలో ఇంతమంది ఉంటే నిజానికి ప్రభుత్వం పోలీసుల ద్వారా బెదిరించకపోతే దాదాపు 80 శాతం పౌరులు ప్రభుత్వాన్ని, జగన్ పాలనను తీవ్రంగా విమర్శించే పరిస్థితి ఉంది.
ఏ పనులు దొరకని రాష్ట్రంలో అత్యధిక ధరలు, పన్నులతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ప్రభుత్వం.
#600DaysOfAmaravatiProtests pic.twitter.com/PgHG8HXf6S
— Mohammed Sharif (@tdpSharif) August 8, 2021
అమరావతిలో రైతుల భూములు అభివృద్ధి కోసం ఇస్తే రాజధానిని ఆపేసి వారి మీద రౌడీ యిజం కక్షసాధింపు చేస్తోంది.
వాళ్లు ఏమైనా తప్పు చేశారా? లేదే… ప్రభుత్వం అడిగితే భూములు ఇచ్చినందుకు ఇంత అణచివేత వేధింపులు.
రాజ్యాంగం శాంతియుత నిరసనలకు అవకావం ఇచ్చింది.
కానీ ఎవరూ నిరసన తెలపకూడదు అంట
మీడియాను అనుమతించరు అంట
ఎందుకు
రహస్యాలు తెలిసిపోతాయనా?
పోలీసుల అణచివేత ప్రపంచానికి తెలిసిపోతుందనా?
ఎందుకీ దాపరికాలు
తాము భయపడుతూ ఇతరుల భయపెట్టడం ఏంటి?
80 శాతం ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని భుజాలెగరేసి చెప్పుకునేవాళ్లు మీడియాలో అమరావతిలో కమ్మోళ్లు (వైసీపీ చెప్పింది ఇదేగా) నిరసన తెలుపుకుంటే భయపడటం ఏంటి?
ఇపుడు ఉన్న టెక్నాలజీతో ఏం జరిగినా క్షణాల్లో బయటకు వస్తుంది అన్న ఇంగితం కూడా లేకుండా అప్రజాస్వామిక ఆంక్షలు పెట్టడం ఏంటి?
ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి.
ఏపీ ఐదున్నర కోట్ల ప్రజలది.
ప్రభుత్వం అందరి పట్ల సమానంగా ఉండాలి.
A woman farmer expresses her anguish…#600DaysOfAmaravatiProtests pic.twitter.com/AREkAy41aY
— Freaky Chakra (@FreakyChakram) August 8, 2021