ఈరోజు వైసీపీ ముఖ్య నేత, జగన్ నమ్మిన బంటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆణిముత్యాల వంటి మాట మాట్లాడారు.
ప్రత్యేక హోదా అడగలేదు అని అనవసరంగా తిట్టాము మనం అందరం. కానీ ఎందుకు ప్రత్యేక హోదా ఇంక ఏపీకి?
మోడీ విన్నా కూడా అవును ఇక మీకు ఎందుకు అంటాడేమో .
‘‘జగన్ రెడ్డి 2 సంవత్సరాలలొ 15 సంవత్సరాల అభివృద్ధి చేశాడు‘‘ – సజ్జల రామకృష్ణారెడ్డి
ఇంక తొక్కలొ హోదాతో పనేంటి అంతేనా సజ్జల గారు?.
2 ఏళ్లకే 15 ఏళ్ల అభివృద్ధి జరిగిన రాష్ట్రానికి ఇక ప్రత్యేక హోదాతో పనేముంటుంది చెప్పండి బ్రదర్? సజ్జల తాజా మాటలను బట్టి ఏపీ అన్ని రాష్ట్రాలను దాటి నెం.1 అయిపోయింది.
అంటే రేపట్నుంచి పింఛను 3 వేలు చేసేస్తారా?
రేపు ఇక సీపీఎస్ రద్దు చేస్తారా?
రేపు 1 వ తేదీ కదా… అప్పు చేయకుండా జీతాలు, పెన్షన్స్ ఇచ్చేస్తారా..
ఇస్తారిస్తారు… ఎందుకంటే 15 ఏళ్ల అభివృద్ధి రెండేళ్లలో జరిగినపుడు ఇవన్నీ చిటికెలో పని అంతే కదా సజ్జల రెడ్డి గారు.