కరోనా కల్లోలం ఒకవైపు సాగుతుండగా.. మరోవైపు దీనికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన వాదనలు వాతావరణాన్ని వేడెక్కేలా చేస్తున్నాయి.
తాజాగా ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అల్లోపతి వైద్యాన్ని ఇష్టానుసారంగా విమర్శించారన్న ఆరోపణ వినిపిస్తోంది.
సంచలనంగా మారిన ఆయన మాటలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రాందేవ్ బాబు.. అల్లోపతి ఒక స్టుపిడ్ సైన్స్ అంటూ వ్యాఖ్యానించటంతోపాటు..
అల్లోపతి మందులు తీసుకున్న లక్షల మంది చనిపోయారు.. రెమ్ డెసివిర్.. ఫాబి ఫ్లూ కూడా ఆ మందులే.
కరోనాచికిత్సతో వాటితో పాటు మరికొన్నింటికి డీసీజీఐ ఆమోదం తెలిపిందన్నారు. కానీ.. అవన్నీ ఫెయిల్ అయ్యాయన్న ఆయన మాటలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాందేవ్ బాబు వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. వైద్య శాస్త్రాన్ని రాందేవ్ బాబు అవమానించారని ఆరోపించారు.
అల్లోపతిపై ఏ మాత్రం అవగాహన లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజానికి హాని చేస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కరోనాను ఒక అవకాశంగా మార్చుకొని ప్రజల్లో భయాందోళనలు పెంచి.. శాస్త్రీయత లేని ఔషధాల్ని అమ్ముకోవటానికి రాందేవ్ ప్రయత్నిస్తున్నారని మండిపడింది.
ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై పతంజలి యోగాపీఠ ట్రస్టు స్పందించింది.
ఆధునిక వైద్యశాస్త్రం పట్ల.. వైద్యులపైన రాందేవ్ బాబా ఎలాంటి వ్యతిరేక భావన లేదని స్పష్టం చేయటం గమనార్హం.
అల్లోపతి స్టుపిడ్ సైన్సు అన్నట్లుగా రాందేవ్ మాటలు ఆయన మాట్లాడిన మాటలు కావని.. ఐఎంఏ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. రాందేవ్ ఒక ఫార్వర్డ్ మెసేజ్ చదువుతున్నారని.. దాన్ని రాందేవ్ బాబానే సొంతంగా అన్నట్లుగా తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
అయినా.. రాందేవ్ లాంటి స్థాయి ఉన్న వారు.. సోషల్ మీడియాలో వచ్చే ఒక స్టుపిడ్ మెసేజ్ ను.. అంతే స్టుపిడిటీతో చదవుతూ.. అల్లోపతి వైద్యంపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారన్నప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజమే.. అది కూడా పాయింటే కదా?