అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం నిరంతరాయంగా సాగుతోంది. రైతులు ఇంత సుదీర్ఘ కాలం నిరసన తెలుపుతారని ఎవ్వరూ ఊహించలేదు.
చివరకు అమరావతి చిచ్చు పెట్టిన జగన్ కూడా ఊహించలేదు. పది రోజుల్లో అంతా చల్లారిపోతుంది అనుకుంటే అది జరగలేదు. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా అయ్యింది జగన్ పరిస్థితి.
ఉద్యమం 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 30-04-2021 శుక్రవారం అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం 500 వ రోజును పురస్కరించుకుని ఆంధ్రుల బ్రతుకు, భరోసా, భవిత కోసం ‘‘అమరావతి ఉద్యమ భేరి @ 500 రోజులు‘‘ పేరుతో వర్చువల్ బహిరంగసభ ప్లాన్ చేశారు.
దీని యూట్యూబ్ లింక్ http://bit.ly/SaveAmaravati ద్వారా ఎవరైనా పాల్గొనవచ్చు.
లక్షలాదిగా పాల్గొని మన ఆంధ్రుల నిగూఢమైన, నిక్షిప్తమైన, నివురుగప్పిన అమరావతి రాజధాని ఆకాంక్షను విశ్వవ్యాప్తం చేద్దాం, సకల జనుల ఆంధ్రవాణి అయినటువంటి అమరావతే ఆంధ్ర ప్రదేశ్ కి ఏకైక రాజధానిగా కొనసాగించే అంతవరకు, జగమొండి ప్రభుత్వపు జడత్వాన్ని వదిలించే అంతవరకు అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిద్దాం అంటూ నిర్వహకులు పిలుపునిచ్చారు.
అమరావతి ఉద్యమ బేరి @ 500 రోజులు సమయం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జె.ఏ.సి) తెలిపింది.