దేశంలో కరోనా రెండో దశ.. భారీ ఎత్తున పెరిగిపోయింది. దేశంలో రోజుకు 2 వేల మంది తక్కువ కాకుండా.. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. అదేసమయంలో లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యి. మరి ఇంత పెద్ద ఎత్తున మృతి చెందడానికి.. ఈ రేంజ్లో కేసులు నమోదు కావడానికి బాధ్యులు ఎవ రు? ఇంత పెద్ద ఎత్తున కరోనా సెకండ్ వేవ్ ప్రారంభానికి కారణాలు ఏంటి? అనే విషయాలపై చర్చ ప్రారం భమవుతున్న సమయంలో తమిళనాడులోని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
తమిళనాడులో కరోనా రెండో దశ ప్రారంభం కావడానికి కేంద్ర ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని.. కేంద్ర ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుతోనే ఇంత మంది ప్రజలు మరణిస్తున్నారని.. వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఎన్నికల అధికారులపై మర్డర్ కేసులు కూడా నమోదు చేయొచ్చని.. ఎందుకు నమో దు చేయకూడదో చెప్పాలని కూడా నిలదీసింది. ఇక, వచ్చే 2వ తారీకున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. కౌంటింగును నిలిపివేస్తామని హెచ్చరిం చింది.
అయితే.. హైకోర్టు వ్యాఖ్యలపై నిముషాల వ్యవధిలో నెటిజన్లు స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యలను స్వాగ తించారు. `హమ్మయ్య..` అంటూ ఇప్పటికైనా.. హైకోర్టు స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. అయి తే.. అదేసమయంలో కొన్ని సందేహాలు, ప్రశ్నలు కూడా తెరమీదికి తెచ్చారు. కరోనా వ్యాప్తికి రాజకీయ కార ణాలు లేవా? అనేది వీరి ప్రశ్న. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా.. సరైన చర్యలు తీసుకోకపోవడంతోపాటు.. ప్రతిపక్ష నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కరోనా నిబంధనలు పాటించలేదని.. వారు కూడా బాధ్యులేనని.. సో.. వారిపై కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసి ఉంటే.. బాగుండేదని అంటున్నారు.
రాజకీయ నేతలు.. కరోనాను ఉదాసీనంగా తీసుకోవడం.. ముందస్తు ఏర్పాట్లు తీసుకోకపోవడం వంటి కార ణాలు వంటివాటిని కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకునే ఉండాల్సిందని, నేతలను ముందు కట్టడి చే యడంతోపాటు.. ప్రభుత్వాలకు.. కూడా కొన్ని హెచ్చరికలు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నా రు. మొత్తానికి మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై నెటిజన్లు ఫిదా అయినప్పటికీ.. కొన్ని కౌంటర్లు మాత్రం పడుతున్నాయి. ఏదైనా.. కరోనా వేదన అలా ఉంది!!