నటుడు, రచయిత, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళికి తాజాగా జనసేన బిగ్ షాక్ ఇచ్చింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఈ చిన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయిన వైసీపీ హార్డ్ నేతలు.. గత ఐదేళ్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. ఉచ్ఛనీచాలు మరచి ప్రతిపక్ష నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టారు. అయితే ఇప్పుడు టైమ్ మారింది.. రూలింగ్ కూడా మారింది.
ఆనాడు కన్ను మిన్ను తెలియకుండా నోరు పారేసుకున్న వైసీపీ నేతలకు నేడు కూటమి ప్రభుత్వం దడ పుట్టిస్తోంది. సోషల్ మీడియా సైకోలకు కళ్లెం వేస్తోంది. ఇప్పటికే అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న పలువురు వైసీపీ కార్తకర్తలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే తరుణంలో వైసీపీ సీనియర్ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ కు కూడా రంగం సిద్ధమవుతోంది.
పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలపై అసభ్య పదజాలంతో దూషించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ సెల్ నాయకులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గతంలో పోసానిపై నమోదైన కేసుల విషయంలో అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని కోరారు. కాగా, వైసీపీ బూతు నేతల కంటే ఎక్కువగా చంద్రబాబు, పవన్‌లను పోసాని టార్గెట్ చేశారు. ముఖ్యంగా పవన్ మరియు మెగా ఫ్యామిలీపై నోటికొచ్చిన విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఓ మెంటల్ కేసు.. అతని సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లు వేయరంటూ పోసాని విమర్శించారు. అప్పట్లో పోసాని వ్యాఖ్యలకు ఆగ్రహానికి గురైన జనసేనుకులు ఆయనపై కేసులు పెట్టారు. వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు ఆయనపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. పోసానికి ఉచ్చు బిగుసుకుంటోంది. పైగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన కూడా పోసాని నోటి దూకుడు తగ్గడం లేదు. కూటమి ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయన అరెస్ట్ ఖాయమనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.