మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జనుపెల్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసిన ఘటన ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దాడిలో జగన్ ఎడమ భూజానికి స్వల్ప గాయమవడంతో.. వైసీపీ నేతలు నానా హడావుడి చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీపైనే నిందలు వేశారు. కానీ విచిత్రం ఏంటంటే.. దాడి చేసిన కోడికత్తి శ్రీను జగన్ కు విరాభిమాని. దాంతో వైసీపీ నేతల ఆరోపణలు టీడీపీ సైతం గట్టిగా తిప్పి కొట్టింది.
ఇకపోతే ఈ కోడి కత్తి కేసు ఇంకా కోర్టులో నానుతూనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసు ఓ కొలిక్కి రావడం లేదు. చాలా కాలం జనుపెల్ల శ్రీనివాసరావు జైలులోనే మగ్గిపోయాడు. వైఎస్ జగన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ కేసు విషయంలో కోర్టుకు హాజరై వాంగూల్మం ఇచ్చింది లేదు. గత ఐదేళ్లు సీఎం హోదాలో ఉండటం వల్ల బిజీ షెడ్యూల్ అనే వంకతో జగన్ కోర్టు విచారణకు డుమ్మా కొట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా జగన్ కు కోర్టుకు హాజరయ్యే తీరిక లేకపోవడం గమనార్హం.
ఇక నేటితో కోడి కత్తి కేసుకు ఆరేళ్లు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికార పార్టీ టీడీపీ జగన్ కు చురకలు వేస్తూ ఓ సెటైరికల్ ట్వీట్ చేసింది. హ్యాపీ కోడి కత్తి డే వైఎస్ జగన్.. 6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్` అంటూ టీడీపీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.