ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. అధికార పార్టీ టీడీపీ, విపక్షంలో ఉన్న వైసీపీ పెట్టిన ట్వీట్స్ ఇప్పుడు రాష్ట్రంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగబోతుంది..? అన్న ప్రశ్న అటు ప్రధాన మీడియా, ఇటు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. `బిగ్ ఎక్స్పోజ్.. కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM.. స్టే ట్యూన్డ్` అంటూ తెలుగు దేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మొదట ట్వీట్ చేసింది.
అసలు ప్రభుత్వం నుంచి ఏం ప్రకటన ఉంటుందా? అని ఆలోచిస్తుండగానే.. వైసీపీ సైతం తామేం తక్కువ కాదన్నట్టుగా ఒక ట్వీట్ చేసింది. `గెట్ రెడీ ఫర్ ద ట్రూత్ బోంబ్.. డ్రాపింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM` అంటూ వైసీపీ ట్వీట్ పెట్టింది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య బిగ్ బ్రేకింగుల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అసలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగబోతుంది..? ఎవరి కొంప కొల్లేరు కాబోతుంది..? బిగ్ ఎక్స్పోజ్ అని ఒక పార్టీ.. బిగ్ రివీల్ అని మరొక పార్టీ ఎందుకు సంచలనానికి తెర లేపారు..? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరక్క ఆయా పార్టీల శ్రేణులు, క్యాడర్ సైతం జుట్టు పీక్కుంటున్నారు. మీడియా సంస్థల రేంజ్ లో ఇరు పార్టీలు సస్పెన్స్ మెయింటైన్ చేస్తుండటంతో.. కచ్చితంగా రాజకీయాలకు సంబంధించిన అంశాలే ఉంటాయని పొలిటికల్ ఎక్స్‌ఫర్ట్స్ భావిస్తున్నారు.