ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇవ్వలేదు. దాంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకి రెండేసి జిల్లాల బాధ్యతలను అప్పగించడం జరిగింది. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జి మంత్రుల లిస్ట్ ను పరిశీలిస్తే..
– శ్రీకాకుళం: కొండపల్లి శ్రీనివాస్
– పార్వతీపురం మన్యం, కోనసీమ: అచ్చెన్నాయుడు
– విజయనగరం: వంగలపూడి అనిత
– విశాఖ: డోలా బాలవీరాంజనేయస్వామి
– అల్లూరి సీతారామరాజు: గుమ్మిడి సంధ్యారాణి
– అనకాపల్లి: కొల్లు రవీంద్ర
– కాకినాడ: పొంగూరు నారాయణ
– తూర్పు గోదావరి, కర్నూలు: నిమ్మల రామానాయుడు
– ఏలూరు: నాదెండ్ల మనోహర్
– పశ్చివ గోదావరి, పల్నాడు: గొట్టిపాటి రవికుమార్
– ఎన్టీఆర్ జిల్లా: సత్యకుమార్ యాదవ్
– కృష్ణా: వాసంశెట్టి సుభాష్
– గుంటూరు: కందుల దుర్గేష్
– బాపట్ల: కొలుసు పార్థసారథి
– ప్రకాశం: ఆనం రామనారాయణరెడ్డి
– నెల్లూరు: ఎన్ఎండీ ఫరూఖ్
– నంద్యాల: పయ్యావుల కేశవ్
– అనంతపురం: టీజీ భరత్
– శ్రీసత్యసాయి, తిరుపతి: అనగాని సత్యప్రసాద్
– వైఎస్సార్: ఎస్.సవిత
– అన్నమయ్య: బీసీ జనార్దన్‌రెడ్డి