ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? మనం ఎలాంటి దేశంలో నివసిస్తున్నాం? ఆలయంలో ప్రవేశించే వ్యక్తి తన మతమేంటో చెప్పాలా? ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం..? అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. తనకు తానుగా తిరుపతి పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు వైపీపీ నాయకులు సైతం కావాలనే తమ అధినేత జగన్ ను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారని కూటమి పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.
అయితే నిజానికి జగన్ తిరుమల దర్శనానికి వెళ్లడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. కానీ ఆలయ సంప్రదాయం ప్రకారం.. క్రైస్తవుడు అయిన జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టడానికి ఇష్టపడని జగన్.. తన తిరుమల టూర్ ను క్యాన్సిల్ చేసుకుని ఇష్యూని కాస్త పొలిటికల్ గా మార్చారు. దీంతో వైసీపీ నాయకులు సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు.
చంద్రబాబు అసలు వేంకటేశ్వర స్వామి వారి భక్తుడు కాదని.. ఎన్నిసార్లు కాలినడకన స్వామివారిని దర్శించుకున్నారని, వేంకటేశ్వర స్వామికి చంద్రబాబు ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవని.. రాజకీయాల కోసం ఆయన దేవుడిని రోడ్డు మీదకు లాగారని విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కాదా.. సోషల్ మీడియా వేదకిగా తమదైన శైలిలో ఇచ్చిపడేస్తున్నారు.
ఆరు పదుల వయస్సులో కూడా ఎక్కడా కూర్చోకుండా గంటలోనే అలిపిరి కాలి నడక మార్గాన తిరుమలకు చేరుకున్న రికార్డ్ చంద్రబాబు పేరిట ఉందని.. మీడియా ప్రతినిధులు అలసిపోయినా బాబు మాత్రం అలసటకు గురికాకుండా నడిచారని ప్రజలు గుర్తు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తే ముఖ్యమంత్రిగానో లేక ముఖ్యమైన నేతగానో కాకుండా సాధారణ భక్తుడిగా రావడానికే బాబు ఇష్టపడతారు. మహాద్వారం నుంచి పోయే అవకాశం ఉన్నా ఎప్పుడూ క్యూ కాంప్లెక్స్ ద్వారానే ఆయన దర్శననానికి వెళ్తారు. భక్తి అంటే అది .. వెంకన్న మీద నమ్మకం అంటే అది.. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో బాబును చూసి జగన్ నేర్చుకోవాలి అంటూ ప్రజలు హితవు పలుకున్నారు.
బాబు గారు ఆరు పదుల వయస్సులో కూడా ఎక్కడా కూర్చోకుండా తిరుమల కి కాలి నడకన వెళ్లారు
ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చూసి నేర్చుకో రా ముండా @ysjagan
భక్తి అంటే ఇది .. వెంకన్న మీద నమ్మకం అంటే ఇది 🙏
గోవింద గోవింద 🙏 pic.twitter.com/rPzxUm8Mmu
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) September 27, 2024