అధికారం పేరుతో అన్యాయంగా, అక్రమంగా ఎగిరెగిరి పడ్డ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసుల్లో ఏపీ హైకోర్టు వైసీపీ నేతలకు తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది. రెండు ఘటనల్లో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పలువురు వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టిపారేసింది.
చంద్రబాబు నివాసంపై గతంలో దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాశ్ తదితర వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లు ఈ రోజు విచారణకు రాగా.. న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు.
కేసు విచారణ పూర్తైన నేపథ్యంలో వారి పిటిషన్లను తిర్కరిస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో వైసీపీ నేతల తరఫున వాదిస్తున్న లాయర్.. రెండు వారాల పాటు తమ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మరియు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అందుకు టీడీపీ న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తుది ఉత్తర్వులు ఈరోజు మధ్యాహ్నం ఇస్తామని పేర్కొంది.