ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ లభించింది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దశాబ్దం క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని మరియు ఆయన పాత్ర ఎంతుందో తేల్చేందుకు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రెండు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.
జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలో ఆ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. బుధవారం ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని… కోర్టులను వేదికగా కాదని రామకృష్ణారెడ్డిని మందలించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఓటుకు నోటు కేసులు చంద్రబాబుకు భారీ ఊరిట లభించినట్లు అయింది.