ఏపీ మహిళలకు తాజాగా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ వెల్లడించింది. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక అప్డేట్ ను అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో లో మహిళా శక్తి పథకం ఒకటి. తమను గెలిపిస్తే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం వంటి పథకాలు అమలు చేయడం జరిగింది. అలాగే డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి వాటిని కూడా సర్కార్ అమలు చేసింది.
ఇక తాజాగా మహిళలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. ఆగస్టు 15న రాష్ట్రంలో ఈ పథకం ప్రారంభించబోతున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్రీ బస్సు సర్వీస్ అమలుపై అధికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.
ఆల్రెడీ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి రావడంతో.. ఏపీ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు తీరును అధ్యయనం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశాఖ వేదికగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం సీఎం చంద్రబాబు చేతులు మీదగా స్టార్ చేయబడుతుంది.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani pic.twitter.com/zJNh0C61aN
— Satya Prasad Anagani (@SatyaAnagani) July 16, 2024