అక్షర శిల్పిగా రామోజీ రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు… దేశం మొత్తానికీ సుపరిచుతులే. 1974లో విశాఖ కేంద్రంగా ఆయన పత్రికా ప్రస్థానం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకుఆయన ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. అసలు ఆయన ప్రస్తానం ఎలా ప్రారంభమయ్యిందనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. వ్యవసాయ కుటుంబానికి చెందిన రామోజీరావు.. రైతుల కష్టాలతో కదిలిపోయారు. ఒక ఏడు కలిసి వస్తే.. రెండేళ్లు నష్టాల బాట పట్టిన రైతుల పక్షాన ఆయన నిలవాలని అనుకున్నారు.
ఈ క్రమంలో చేతిలో ఆయనకు సొమ్ములేదు. భార్య పుస్తెల తాడును తాకట్టుపెట్టి.. ప్రారంభించిన సంస్థే.. అన్నదాత మాస పత్రిక. ఇదే.. 1974లో పురుడు పోసుకుంది. ప్రముఖ నటుడు.. గోల్ల పూడి మారుతీరావు.. ఓ సందర్భంలో మాట్లాడుతూ… “రామోజీరావును నేను చాలా దగ్గరగా చూశాను. భార్యపుస్తెల తాడు పెట్టి పత్రికను ప్రారంభించారు. మారుతీరావు గారూ.. రైతుల కష్టాల ముందు .. నేను చేస్తున్న ప్రయత్నం అతి స్వల్పం అని.. ఆయన అప్పట్లో చెప్పిన విషయం నాకు ఇప్పటికీ గుర్తింది“ అని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత.. నాలుగేళ్లకు.. 1978-80ల మధ్య ఈనాడు ప్రస్థానం ప్రారంభమైంది. అది కూడా.. విశాఖ ప ట్నం నుంచే ప్రారంభమైంది. ఇక, ఆ తర్వాత.. అన్నగారు ఎన్టీఆర్ పార్టీ పెట్టడం.. దానికి వెన్నుదన్నుగా రామోజీ నిలబడడం..తెలిసిందే. ఇక, అప్పటి నుంచి నేటి వరకు వెనుదిరిగి చూసుకోకుండానే రామోజీ తన జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. అనేక వ్యాపారాలు చేపట్టారు. వాస్తవానికి 1962లోనే మార్గదర్శి ని ప్రారంభించినా.. తొలినాళ్లలో నష్టపోయారు. దీంతోనే భార్య పుస్తెల తాడును తాకట్టు పెట్టాల్సి వచ్చిందని మారుతీరావు చెప్పుకొచ్చారు.
ఫిలిం సిటీ విషయానికి వస్తే.. ఈనాడుపై వచ్చిన లాభాలను గుట్టల కొద్దీ దీనికి తరలించారు. రిజర్వ్ బ్యాంకు నుంచే అప్పులు తెచ్చుకున్నారు. అందరిలోనూ విస్మయం. ఎవరు వస్తారు? ఎవరు ఇక్కడ షూటింగులు చేస్తారు? అని.. అయినా.. రామోజీ వెనక్కి తగ్గలేదు. ప్రపంచ స్థాయి ఏర్పాట్లు చేశారు. డబ్బులతో వస్తే.. చాలు.. ఇక్కడ నుంచి సినిమాచేసుకుని వెళ్లి పోవచ్చన్న నినాదం బాగా వర్కవుట్ అయింది. ఆర్టిస్టుల నుంచి ఎక్విప్ మెంట్లు, లొకేషన్లు.. డైలాగులు, పాటలు, రికార్డింగులు.. `మాయ` డిజిటల్ ఎక్విప్మెంట్ వంటివి అన్నీ.. ఇక్క డ సమకూర్చారు. మొత్తంగా దేశంలో ఒక పత్రికా అధినేతకు సొంతగా ఇల్లు ఉండోచ్చు.. సొంతగా ఒక పొలం ఉండొచ్చు.. కానీ.. ఒక ప్రత్యేకమైన నగరాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మాత్రం రామోజీనే!!