• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రామోజీరావు అక్షరాల “జర్నీ”లిస్టు..!

admin by admin
June 8, 2024
in Andhra, Politics, Top Stories
0
రామోజీ
0
SHARES
50
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈనాడు సంస్థల అధినేత, తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు ఈ రోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక సామాన్యుడిగా కెరీర్ మొదలు పెట్టిన రామోజీరావు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకునే వరకు సాగించిన ప్రయాణం ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన అకుంటిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన వైనం ఎందరికో ఆదర్శప్రాయం. ముఖ్యంగా అక్షరాలతో రామోజీ రావు చేసిన ప్రయాణం తెలుగు మీడియాలో మరెవరూ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన రాసేది తక్కువే అయినా..రాయించేది ఎక్కువే. అందుకే, ‘జర్నలిస్టు’లతో రామోజీ రావు అక్షరాల ‘జర్నీ’ ఎంతో ఆసక్తికరం…మరెందరికో స్ఫూర్తిదాయకం!

_ఆయన రాసేది తక్కువే..!_
_రాయించేది ఎక్కువ..!_
_అలా రాయించేటపుడు జంకడు..!_
_బెదరింపులు రానీ..!_
_ఒత్తిడులు పెరగనీ..!_
_దాడులే జరగనీ…!_
_రాయిలా నిలబడి రాయిస్తూనే ఉన్నాడు..!_
_అలా అక్షరయాత్ర సాగించి..!_
_అనుకున్నవి ఎన్నో సాధించి..!_
_ఒక మహాక్రతువును ముగించి..!_
_విజయగర్వంతో అక్షరమాల ధరించి దివికేగాడు..!_
_మూత పడని ఆ పెన్ను..!_
_అవినీతిపై ఈనాడు పేరిట ఏనాడో ఎక్కుపెట్టిన గన్ను..!_

_అక్షరమే ఆయుధమై..!_
_సమాజహితంలో తానే ఒక సమిధయై..!_

_ఎక్కడో పుట్టినా వార్త..!_
_రామోజీరావు దాని కర్త..!_
_ఆ వార్తకు సంస్కర్త..కృతిభర్త..!_

_ఇలా ఉంటే అది వ్యాసమని..!_
_అలా చదవడమే పాఠకుని వ్యాసంగమని..!_
_నిర్వచించి..అదే ప్రవచించి..!_
_అలాగే రాయించి..!_
_పత్రికకి ప్రమాణం..!_
_నిర్దేశించిన చారిత్రక ప్రయాణం..!_

_నీ ఆసక్తి..నా అనురక్తి..!_
_రామోజీరావు యుక్తి..!_
_తెలుగు భాషకు ఈనాడు ప్రథమావిభక్తి..!_
_చదివేవాడికి రక్తి..ఎందరికో భుక్తి..!_

_ఈనాడు మూలవిరాట్టు..!_
_ఆధునిక మీడియా సామ్రాట్టు..!_
_పట్టిందే పట్టు..విడిచిపెడితే ఒట్టు..!_
_పోరాటమే పధం..అక్షరమే ఆయుధం..!_
_ఈనాడే పాశుపతం..!_
_అదే రామబాణం..అదే సుదర్శనం..!_
_ప్రతి ఉదయం సంచలనంతో దర్శనం..!_
_రామోజీ ధైర్యానికి ఆ పత్రికే నిదర్శనం..!_

_ఈనాడు ఒక వ్యసనం..ఒక శాసనం..!_
_పాఠకుడికి ఏకాసనం..అధినేతకు సింహాసనం..!_

_సామాన్యంగా మొదలైన సినిమా ప్రయాణం..!_
_”*ఉషాకిరణ్..తిమిర సంహరణాలు”*..!_
_అదీ ఒక చరిత్రే..!_
_ఆయన సినిమాలూ అవకరాలకు ప్రతిఘటనే..!_

_*”ఫిలిం సిటీ”* రామోజీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి..!_
_బాలీవుడ్ సైతం చూడని మరో ప్రపంచం..!_
_హాలీవుడ్ స్థాయి సంచలనం..!_
_ఇలాంటి ఎన్నో అపురూపాలతో సదా అద్భుతాలతో రామోజీరావు కరచాలనం..!_
_పత్రికా రంగానికి ఆయనే మార్గదర్శి..!_
_అక్షరానికి బలం..!_
_వార్తకు శక్తి..రాతకు ఉన్నతి..!_
_పత్రికకు గౌరవం..!_
_ప్రచురణకు సాంకేతికత..!_
_పాఠకుడికి ఉత్సుకత..!_
_ఇవన్నీ రామోజీరావు భావుకత..!_

Tags: Eenadujournalismjourney with lettersRamoji raostandards
Previous Post

భార్య‌పుస్తెల తాడు తాక‌ట్టు పెట్టి..రామోజీ ఎలా ఎదిగారు?

Next Post

అమ‌రావ‌తి పేరు పెట్ట‌మ‌న్న‌ది రామోజీనే: చంద్రబాబు

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

అమ‌రావ‌తి పేరు పెట్ట‌మ‌న్న‌ది రామోజీనే: చంద్రబాబు

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra