ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ అలియాస్ దీదీ .. పాలిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు పుట్టాయి. ఇక్కడి కమ్యూనిస్టుల ఆధిపత్యాన్ని, అధికారాన్ని అడ్డుకుని.. ప్రజాస్వామ్య యుత ఎన్నికల్లో విజయభేరి మోగించిన మమత 2010 నుంచి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. వరుసగా మూడు సార్లు విజయం దక్కించుకున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే.. ఇప్పుడు అనూహ్యమైన సంచలన ఘటన చోటు చేసుకుంది. కీలకమైన `ఓబీసీ` సర్టిఫికెట్లను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తక్షణమే తమ ఆదేశాలు అమలు చేయాలని కూడా.. పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ అంటే.. కమ్యూనిస్టులకు కంచుకోట. 40 ఏళ్లపాటు ఈ రాష్ట్రాన్ని కామ్రేడ్స్ పాలించారు. వీరి ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కూడా చతికిల పడింది. అలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న మమత.. విడిపోయి.. సొంతగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)ని స్తాపించుకుని రాష్ట్రంలో ఎదిగారు. 2010లో జరిగిన ఎన్నికల్లో ఆమె అప్రతిహత విజయం దక్కించుకున్నారు. నాడు ఆమె విజయానికి కారణం.. అణగారిని వర్గాలకు కూడా.. ఓబీసీలుగా గుర్తింపు ఇస్తామని! ఇదే ఆమెను అధికార పీఠం దిశగా నడిపించి.. కామ్రెడ్ల ఆధిపత్యానికి జల్ల కొట్టింది.
ఇక, హామీ ఇచ్చిన మేరకు మమతా బెనర్జీ 2010లో అధికారంలోకి రాగానే.. వచ్చిన రెండేళ్లలోనే అంటే.. 2010-12 మధ్య సు మారు కోటి మందికి పైగా లబ్ధి చేకూరేలా .. 42 సామాజిక వర్గాలను `ఓబీసీ` పరిధిలోకి తీసుకువచ్చారు. ఫలితంగా విద్యాలయా ల్లో ప్రవేశాలు, రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు.. ఇలా.. అన్నీ ఆయా వర్గాలు పొందాయి. అయితే.. ఎక్కడైతే.. మమ త బల పడ్డారో.. అక్కడే దెబ్బకొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ప్రయత్నించింది. ఓబీసీ రిజర్వేషన్ సహా.. దీని కింద ఇచ్చిన.. సర్టిఫికెట్లపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.
గత రెండేళ్లుగా ఈ పిటిషన్లపై విచారణ జరిపిన.. సుప్రీంకోర్టు.. మమత తొలినాళ్లలో తీసుకున్న నిర్ణయంపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బెంచ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ అధ్యయనం తాజాగా ముగిసింది. ఈ క్రమంలో బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 2010-12 మధ్య 42 సామాజిక వర్గాలను(క్లాసులు) ఓబీసీలుగా గుర్తించడాన్ని తప్పుబట్టింది. ఇది చట్ట ప్రకారం జరగలేదని.. వారిని అనవసరంగా ఓబీసీలుగా గుర్తించారని పేర్కొంటూ.. సదరు సర్టిఫికెట్లను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. ఇది.. కీలకమైన ఎన్నికలకు ముందు.. మమతకు ఇబ్బందిగా మారుతుందనేది ఒక అంచనా. మరోవైపు.. కాదు.. బీజేపీకే ఇబ్బందని మరో వర్గం చెబుతుండడం గమనార్హం.