వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కొనసాగిస్తూ కొన్ని మార్పులు మాత్రమే చేశారని విమర్శలు వచ్చాయి. ఈ మేనిఫెస్టోతో వైసీపీ ఓటమి సగం ఖాయమైందని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఓటమిని పరిపూర్ణం చేసేలా వైసీపీ మేనిఫెస్టోను తలదన్నే రీతిలో ఈ రోజు టీడీపీ, జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ స్థాయి నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ‘‘ ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం…రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం’’ అనే నినాదంతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైంది.
మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం, బీజేపీ సూచించిన అంశాలు కలగలిపి ఈ మేనిఫెస్టో రూపొందించామన్నారు. బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోను ఎండార్స్ చేసిందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని అన్నారు. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు
బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు
బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేయడం
బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు
ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు
పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్
మత్స్యకారులను ఆదుకునే కార్యక్రమాలు
డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం
20 లక్షల మంది యువతకు ఉపాధి
నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు
స్కిల్ గణన చేపడతాం
ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు
10 శాతం EWS రిజర్వేషన్ల అమలు
సమగ్ర ఇసుక విధానం
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు
కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతాం