అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలులు అయినటువంటి ఎన్నారైలు ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
‘సేవ్ ఆంధ్రా’ అనే నినాదం తో ఏర్పాటుచేసిన ఈ సమావేశం లో పలువురు ఎన్నారైలు ఆత్మీయంగా కలుసుకుని రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో NDA కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి మనమంతా ఏవిధంగా సహాయపడగలం, మనవంతు సహాయ సహకారాలు ఏవిధంగా NDA కూటమికి అందిచాలి అనే అంశాల్ని ఈ సమావేశంలో చర్చించారు.
గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలుగా ఎలా అధోగతిపాలు అయిపోయింది అని మాట్లాడుతూ పలువురు ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేసారు.
కొంతమంది మాట్లాడుతూ మన సొంత రాష్ట్రం దుస్థితి చూసి బాధేస్తుంది అంటూ విచారం వ్యక్తం చేసారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఇలాంటి తిరోగమనం మన రాష్ట్రం ఎప్పుడూ చూడలేదు అంటూ ఆందోళన వ్యక్తం చేసారు.
రాబోయే నెలరోజులు మనకి చాలా కీలకమైనవి అని మనమందరం కుదిరిన వాళ్ళు గ్రౌండ్ లోకి దిగుదాం అని అలాగే కుదరనివాళ్ళు ఇక్కడినుండే మద్దతుగా చేయాల్సిన కార్యక్రమాలు చేద్దాం అని తీర్మానించారు.
అలాగే మన వంతు ఆర్ధిక సహాయాన్ని జనసేన తెలుగు దేశం కూటమికి అందించాలి అని తీర్మానించుకున్నాం అని కూటమి సభ్యులు తెలియచేసారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం కి చెందిన ఎన్నారై సభ్యులు జయరాం కోమటి, శ్రీనివాస్ దేవల్ల, వెంకట్ కోగంటి, సత్య పోలవరపు, హరి సన్నిధి, జనసేన కి చెందిన వేణు అనుగంటి, తులసీరాం రావూరి, రామ్ చుండూరి, శ్రీనివాస్ చిమట, రెడ్డయ్య ప్రత్తిపాటి, అనిల్ అరిగే, సునీల్ పసుపులేటి, దుర్గ పెద్దిరెడ్డి, శంకర్ అడాబా, చంద్ర పట్టివాడు, సత్య పుట్ట, నారాయణ మట్టిగంట, రమేష్ రాగినేని, కిషోర్ కుమార్, నిరంజన్, రమణ అనుగంటి మరియు తెలుగుదేశం-జనసేన- బిజెపి పార్టీల అభిమానులు పాల్గొన్నారు.