టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు మరోసారి భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్.. బాబుతో అంతర్గత సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఇరువురు చర్చించుకున్నారు. కీలకమైన రెండు విషయాలపై వారు దృష్టిపెట్టినట్టు సమాచారం. మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో దానిపై చర్చించారని తెలిసింది.
అదేవిధంగా పార్లమెంటు స్థానాలపైనా ఒక అవగాహనకు వచ్చారని, అభ్యర్థుల ఎంపికపై కసరత్తును దాదాపు పూర్తి చేశారని సమాచారం. ఈ విషయంపైనే ఇరువురు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఇక, మరోఅతి ముఖ్యమైన విషయం.. బీజేపీతోపొత్తులు. బుధవారం పవన్ కళ్యాణ్ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి లేదా గురువారం ఉదయం ఆయన బీజేపీ నేతలతో చర్చలకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో బీజేపీతో చర్చించబోయే అంశాలపైనా క్లారిటీ తీసుకున్నట్టు తెలిసింది.
బీజేపీ కలిసి వస్తే.. ఆ పార్టీకి ఎన్ని టికెట్లు ఇవ్వాలి. ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి? బీజేపీ ఏం ఆశిస్తున్నది అనే విషయాలను ప్రధానంగా ఇరువురు నాయకులు చర్చించుకున్నట్టు సమాచారం. ఈఎన్నికల షెడ్యూల్‌కు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో బీజేపీతో ఈ రోజు పొత్తును దాదాపు ఓకే చేసుకుని తీరాలనే వ్యూహంతోఇరు పక్షాలు ఉన్నాయి. దీంతో పవన్ ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు తోచర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చంద్రబాబు ఈ విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నారని తెలిసింది. వీలైనంత త్వరగా పొత్తులు నిర్దారించుకుని అభ్యర్థులను ప్రకటించే విషయంపై ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.