ఏపీలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాల వేళ సర్వేల హడావిడి మామూలుగా లేదు. రకరకాల సంస్థలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సర్వేల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా చింతలపూడి ( ఎస్సీ) నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై సొంగా రోషన్ కుమార్ పేరును పార్టీ అధినేత చంద్రబాబు తొలి జాబితాలోనే ప్రకటించారు. తొలి జాబితా రిలీజ్‌కు జస్ట్ మూడు రోజుల ముందే నియోజకవర్గ సమన్వయకర్తగా రోషన్ పేరు ప్రకటించగా.. తొలి జాబితాలోనే అభ్యర్థిత్వం దక్కడంతో రోషన్‌కుమార్ ప్రజల్లోకి స్పీడ్‌గా దూసుకుపోతున్నారు.
చింతలపూడిలో రోషన్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందు సర్వేలు జరిగాయి… ఖరారయ్యాక కూడా సర్వేలు జరుగుతున్నాయి. తాజాగా రెండు సర్వేలు రోషన్ కుమార్ ఇక్కడ ఘనవిజయం సాధిస్తున్నట్టు స్పష్టం చేశాయి. రైజ్ సర్వేలో సొంగా రోషన్ విజయం సాధిస్తున్నట్టు క్లీయర్‌గా వెల్లడైంది. మరో నేషనల్ మీడియా గ్రూప్ చేసిన సర్వేలో రోషన్ కుమార్ గెలవడంతో పాటు ఏకంగా 30 వేల పై చిలుకు మెజార్టీ వస్తుందని రిపోర్టు రావడం టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతోంది.
రోషన్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం సామాజిక సమీకరణల పరంగా చేసిన రిస్క్‌తో పాటు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం.. క్లీన్ ఇమేజ్‌తో రంగంలోకి దిగుతుండడం.. ఎలాంటి మైనస్‌లు లేకపోవడం కూడా ఆయనకు బాగా ప్లస్ కానుంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా నియోజకవర్గంలో ఎక్కువుగా కనిపిస్తోంది. నాలుగు మండలాలతో పాటు జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలో పార్టీ చాలా చాలా బలంగా ఉండడం, ఇటు చింతలపూడి నగర పంచాయతీలో రోషన్‌కు విస్తృతంగా ఉన్న బంధుత్వాలు, చింతలపూడి నగర పంచాయతీకి గుండెకాయ లాంటి సుప్రీమ్పేట మనవడు కావడం ఇవన్నీ రోషన్‌కు బాగా ప్లస్ అయ్యాయి.
గత పదేళ్లుగా లింగపాలెం, చింతలపూడి మండలాల్లో రోషన్ కంటిన్యూగా చేస్తోన్న సేవల ఎఫెక్ట్ కూడా ఈ రెండు మండలాల్లో టీడీపీకి చాలా కలిసొస్తోంది. ఇక రోషన్ అభ్యర్థిత్వం ఖరారు కాగానే నియోజకవర్గంలో గ్రూపులన్నీ మటుమాయం అయిపోయాయి. కొందరు నేతలతో పాటు కొన్ని ఊళ్లలో గ్రూపు రాజకీయాలు ఉన్నా కేడర్ అంతా ఏకతాటిమీదకు వచ్చేయడం కూడా ఇక్కడ టీడీపీ / రోషన్ గెలుపుకు మంచి ఊపునిచ్చినట్లయ్యింది.