మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి అరెస్టు చేసినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి, వైఎస్ జగన్ చంద్రబాబుపై అనేక కేసులు పెట్టారు. అయితే… ఈ పరిణామంతో టీడీపీ కేడర్ డీలా పడుతుందని, నాయకత్వ లేమి ఏర్పడి కేడర్ చెల్లాచెదరు అవుతుందని జగన్ భావించాడు.
దీంతో పాటు జనసేన కూడా పునరాలోచనలో పడి… పొత్తు పెట్టుకోదని, పెట్టుకున్నా ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుందని జగన్ భావించాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ ఊహించని సంఘటనలు రెండు జరిగాయి. దీంతో చంద్రబాబు అరెస్టు వల్ల చంద్రబాబుకు ఏమీ డ్యామేజీ కాకపోగా… జగన్ పార్టీకి పెద్ద ముప్పు వచ్చి పడింది.
జగన్ ఊహించని రెండు పరిణామాలు ఏంటంటే…
- బ్రాహ్మణి వ్యాపారాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని జగన్ ఊహించలేదు. ఆమె ఇంత క్లియర్ గా తెలుగు స్పీచ్ ఇవ్వగలదని అసలూహించలేదు.
2. ఇక రెండో పాయింట్… జనసేన తెలుగుదేశం పొత్తు విషయంలో జగన్ అనుకున్నది జరగకపోగా… ఎపుడో జనవరిలో వెలువడాల్సిన పొత్తు ప్రకటన పవన్ వెంటనే ప్రకటించాడు. దీంతో వైసీపీ దిక్కు తోచని స్థితిలో పడింది.
ఇపుడు తెలుగుదేశం బలం పెరిగినట్టయ్యింది. పవన్ ఇంత వన్ సైడ్ గా టీడీపీ వైపు నిలబడతాడని ఊహించని జగన్ అవాక్కయ్యారు. మరోవైపు నారా బ్రాహ్మణి ఎంతో ట్రైన్డ్ పొలిటీషియన్ లా మాట్లాడటం ఆయనకు మరో షాకు. మొత్తానికి చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కి కొత్త హోప్ దొరికింది. జగన్ గ్రాఫ్ మరింత పడిపోయింది. జగన్ వి కక్షా రాజకీయాలు అని మెజారిటీ ప్రజలు నమ్మేలా జగనే చేశాడు.