చంద్రబాబు నాయుడుకు మీ అందరి మద్దతు చూసి గర్వ పడుతున్నా అని సంఘీభావం తెలిపిన ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి ఆనందం వ్యక్తంచేశారు. ప్రజల మేరే కోరే నాయకులు ప్రజలు ఎపుడూ కాపాడుకుంటారు అని చెప్పడానికి మీరే ఉదాహరణ అని వారిని బ్రాహ్మణి అభినందించారు.
★ హైదరాబాద్ లో వివిధ కంపెనీల్లో పని చేస్తోన్న ఐటీ రంగ ఉద్యోగులు నారా బ్రాహ్మణిని కలిశారు.
★ చంద్రబాబు నాయుడు అరెస్టు పూర్తిగా అక్రమమని, ఒక విజనరీ లీడర్ ను జైలులో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందని వారు అభిప్రాయ పడ్డారు.
★ హైదరాబాద్ ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు నాయుడు అరెస్టు కక్ష పూరిత చర్య అని ఐటీ ఉద్యోగులు అన్నారు.
★ చంద్రబాబు నాయుడు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని…..తెలుగు జాతి కోసం, యువత కోసం నిత్యం శ్రమించిన నాయకుడు చంద్రబాబు అని వారు అన్నారు.
★ హైదరాబాద్ లో పని చేస్తున్న తాము రాజమహేంద్రవరం వస్తుంటే ఏపీ పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టారని తెలిపారు.
★ సొంత రాష్ట్రానికి వస్తుంటే అడ్డంకులు, కేసులు పెడతాం అనే బెదిరింపులు ఏంటో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
★ తమ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నారని…. వాట్సాప్ చాటింగ్ కూడా చెక్ చేశారని హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ ఉద్యోగులు తెలిపారు.
★ ఇక్కడ హోటల్ రూంలో దిగితే పోలీసులు వచ్చి తమను రూంలో పెట్టి తాళాలు వేశారని…అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదని అన్నారు.
★ సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
★ 25 ఏళ్ల క్రితం రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతం నేడు ఈ స్థాయిలో అభివృద్ది చెంది లక్షల మందికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారడం వెనుక ఉన్న చంద్రబాబు కృషిని ఎవరూ చెరిపివేయలేరని ఉద్యోగులు నారా బ్రాహ్మణితో చెప్పారు.
ఈ సందర్భంగా బ్మాహ్మణి మాట్లాడుతూ..
తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణం అని అన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్ లు చెక్ చేయడం, వారి చాట్ లు పరిశీలించడం షాక్ కు గురిచేసింది అన్నారు. పోలీసుల చర్య వ్యక్తి గత గోప్యత హక్కును హరించడమే అన్నారు.
సామాన్య ప్రజల ఫోన్ లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఏ కారణంతో, హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు. మీకు తెలిసి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు కు సంఘీభావం తెలిపేందుకు అనేక వ్యయ ప్రయాసలు ఓర్చి, ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వ పడుతున్నా అని బ్రాహ్మణి వారికి ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు ఈ కష్ట సమయాన్ని అధికమిస్తారని…సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు ఆయన అని అన్నారు. యువత అంతా తమ ఓట్లు చెక్ చేసుకోవాలని…రానున్న రోజుల్లో ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని కోరారు. ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు…అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా ప్రజలను చైతన్య పరిచే బాధ్యత తీసుకోవాలని తనను కలిసిన ఉద్యోగులను బ్రాహ్మణి కోరారు.