తెలుగు దేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే కార్యక్రమం మహానాడు. గత 20 సంవత్సరా లకు పైగా ఏటా నిర్వహిస్తున్న మహానాడుకు చాలా ప్రత్యేకత ఉంది. అనేక ఒడిదుడుకులు ఎదురైనా.. మహానాడుకు ప్రాధాన్యం తగ్గకుండా నిర్వహిస్తున్నారు. ఇక, మహానాడు అంటే.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు పుట్టిన రోజుకు ఒకరోజు ముందు.. తర్వాత రోజు వరకు అంటే.. మూడు రోజుల వరకు నిర్వహించుకునే పసుపు పండుగగా.. ఆ పార్టీ నాయకులు పేర్కొంటారు.
అయితే.. ఎందుకు ఇలా.. అన్నగారి పుట్టిన రోజు నాడే ప్రారంభించాలి? అన్నగారి పుట్టిన రోజుకు మహానా డుకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఆసక్తికర విషయం. వాస్తవానికి ఏ పార్టీకైనా కీలక రోజు ఆ పార్టీని స్థాపించిన రోజు. ఆ రోజును ఘనంగా నిర్వహించుకోవడం.. పెద్ద ఎత్తున సభలు పెట్టుకోవడం.. భవిష్యత్ కార్యాచరణను ఏర్పాటు చేసుకోవడం వంటివి కామనే. కానీ, టీడీపీ విషయానికి వస్తే.. పార్టీని స్థాపించిన రోజు కన్నా మహానాడుకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంది.
నిజానికి టీడీపీని స్థాపించింది.. మార్చి 29, 1982వ సంవత్సరం. సో.. దీనిని బట్టి పార్టీ తరఫున ఏదైనాపెద్ద కార్యక్రమం చేయాలంటే.. ఈ రోజు చేయాలి. కానీ, దీనికి సంబంధం లేకుండా.. మే 27-29 వరకు మహానా డును భారీ ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించడం ఏంటనే సందేహాలు సహజంగా తెరమీ దికి వస్తాయి. దీనికి పెద్ద కారణమే ఉంది. పార్టీ తరఫున అన్ని వర్గాలను సమైక్య పరచాలని నిర్ణయం వచ్చినప్పుడు.. ఎప్పుడు నిర్వహించాలనే చర్చ జరిగింది. దీనికి అనేక తిథులు వారాలు వర్జ్యాలు కూడా చూశారు.
కానీ, వాటిపై పార్టీలో నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అంతేకాదు.. మహానాడుకు ముందు.. టీడీపీ ఉత్స వం అనే పేరు పెట్టాలని కూడా అనుకున్నారు. అది కూడా అన్నగారికి నచ్చలేదు. దీంతో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈలోగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బుచ్చయ్య చౌదరి వంటి అప్పటి యువ నాయకులు.. “మీ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని జిల్లా పార్టీ నాయకులు నిర్వహించారు. దీనికి మీరు రావాలి“ అని ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమాన్ని ఆయనకు వివరించారు. దీంతో అన్నగారి మైండ్ తళుక్కున మెరిసన ఆలోచన తన పుట్టిన రోజు నాడే మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. ఇలా.. మహానాడుకు అన్నగారి పుట్టిన రోజుకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఛలో రాజమండ్రి ✌️
పసుపు జాతర ???????? #Mahanadu2023 pic.twitter.com/VuhF9YKDwM— Venu M Popuri (@Venu4TDP) May 26, 2023
https://twitter.com/ncbnstan/status/1662090957955768320
#Mahanadu2023 ✌️ pic.twitter.com/1CBtD0g1Jf
— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) May 26, 2023