ఇన్ని రంగులు మార్చేవాడు, ఈ ప్రపంచంలోనే ఉండడు
* భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ముందుకెళ్ళకుండా కేసులు వేసి నేను ఆపుతా
* నేను రాగానే, భోగాపురం భూములు తిరిగి ఇచ్చేస్తా
* భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆపేసి, విశాఖ ఎయిర్ పోర్ట్ ని బాగా అభివృద్ధి చేస్తా pic.twitter.com/30Cauvlbpk— Telugu Desam Party (@JaiTDP) May 3, 2023
జగన్ మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటనలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్.. ఈ రెండింటికీ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి ఇది నిజం కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో 2018లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
ఈ విమానాశ్రయానికి దాదాపు 50% భూసేకరణ పూర్తయింది, అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రైతులను రెచ్చగొట్టి నిరసనలను పెంచింది. దీనికి న్యాయపరమైన అడ్డంకులను కూడా సృష్టించింది. భూసేకరణలో అక్రమాలు జరిగాయని కూడా ఆరోపించారు. దీనివల్ల భూసేకరణ మధ్యలో ఆగిపోవడానికి వైసీపీ వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది.
అప్పట్లో భూసేకరణ అక్రమాలు జగన్ ఆరోపించినా అధికారంలోకి వచ్చాక జగన్ నేటికీ ఎకరం భూమి తిరిగి ఇవ్వలేదంటున్నారు రైతులు. జీఎంఆర్ గ్రూపునకు ఎయిర్పోర్టు కాంట్రాక్టు ఇవ్వడంలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కానీ అదే జీఎంఆర్ గ్రూపుతో ఇపుడు కూడా శంకుస్థాపన జరుగుతోంది.
అదానీ డేటా సెంటర్కు కూడా 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. ఇది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన ప్రాజెక్టు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రాజెక్టును కొంతకాలం ఆపి… అదానీని ఇతర ఆఫర్లు ఇచ్చి… తాజాగా మళ్లీ శంకుస్థాపన చేసుకుని తన అక్కౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు శంకుస్థాపనతో క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
నాలుగేళ్లుగా జగన్ ఏమీ చేయలేదు, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో హడావుడిగా ఫోటోలు దిగే ప్రయత్నం చేయడం విశేషం అని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. చెల్లికి పెళ్లి జరగాలి మల్లి మల్లి అంటూ వైజాగ్ వాసులు ఈరోజు జగన్ కార్యక్రమాలపై సెటైర్లు వేస్తున్నారు.
https://en.wikipedia.org/wiki/Bhogapuram_Airport
భోగాపురం విమానాశ్రయానికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన చేయడానికి జగన్ సార్ సంతోషంగా గర్వపడుతున్నాడంట. నిజమే ఏపీ ప్రజలు కూడా గర్వపడాలి. ఎందుకంటే రంగులు మార్చే ఊసరవెల్లిని మించి పోయాడు జగన్ రెడ్డి. ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిత్వం దేశంలో ఏ నాయకుడికి ఉంటుంది చెప్పండి pic.twitter.com/tCMXORZHV1
— Telugu Desam Party (@JaiTDP) May 3, 2023