చంద్రబాబు వ్యవసాయాన్ని దండగ అన్నాడనే పేటియం కుక్కల కోసమే ఈ వీడియో pic.twitter.com/1A8WecXALg
— I Love India✌ (@Iloveindia_007) April 28, 2023
టీడీపీ అధినేత చంద్రబాబుపై గతంలో ఓ అపవాదు ఉండేది. ఆయన రైతులు, వ్యవసాయానికి వ్యతిరేకి అనేదే ఆ అపవాదు. టెక్నాలజీ, సర్వీస్ సెక్టార్లను ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించిన ఆయన నిత్యం అదే విషయం వల్లె వేస్తుండడంతో రైతుల పట్ల ఆయనకు ఏమాత్రం కన్సర్న్ లేదన్న ముద్ర ఉండేది.
రాష్ట్ర విభజన తరువాత 2014లో సీఎం అయిన తరువాత ఆయన ఆ ముద్ర పోగొట్టుకున్నారు. అమరావతిలో మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నప్పటికీ వారికి మంచి ప్యాకేజీలు ఇవ్వడం, నిత్యం ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేయడంతో రైతుల మద్దతు దొరికింది.
అంతేకాదు.. చంద్రబాబు పాలనలో రైతులకు రాయితీపై పరికరాలు, విత్తనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు, మద్దతు ధర, మార్కెట్ అన్నీ ఉండేలా చేశారు.. అంతెందుకు 2019లో అధికారం కోల్పోయినప్పటికీ రాజధాని అమరావతి రైతుల కోసం నిత్యం పోరాడారు. ప్రస్తుతం టీడీపీ, చంద్రబాబు మళ్లీ పుంజుకుంటున్న దశలో ఆ జోరుకు బ్రేక్ వేసేందుకు.. చంద్రబాబును బూచిగా చూపేందుకు వైసీపీ వర్గాల నుంచి ఎదురుదాడి మళ్లీ మొదలైంది. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని, వ్యవసాయం దండగ అన్నారన్న ప్రచారం పెద్దఎత్తున ప్రారంభించింది వైసీపీ.
అయితే.. ఈ విషయం చంద్రబాబు వరకు చేరడంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు ఆయన. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అందరం కేవలం వ్యవసాయంపైనే ఆధారపడితే పేదవారిగానే మిగిలిపోతామని నాడు తాను చెప్పానని, కానీ దానిని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తాజాగా వివరణ ఇచ్చారు.
చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారంటూ వైఎస్ హయాం నుంచి ఆయనపై విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పుడు వైసీపీ శిబిరాల నుంచి మరోసారి ఈ అటాక్ మొదలైంది. ఇది గుర్తించిన చంద్రబాబు ఈ అంశంపై స్పందించారు. నాడు తాను ఏమన్నది వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. “నేను వ్యవసాయం దండగ అన్నానని ఒకప్పుడు నాపై విమర్శలు చేశారు. కావాలనే దాన్ని ప్రతిరోజూ ఊతపదంలా వాడారు. ఆ రోజున నేను చెప్పింది ఏంటంటే… రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అందరం కేవలం వ్యవసాయంపైనే ఆధారపడితే పేదవారిగానే మిగిలిపోతామని అన్నాను.
భవిష్యత్తు అనేది ఒక నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడే అవకాశం వచ్చింది… మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరిని ఐటీ చదివించండి, ఇంకొకరిని వ్వవసాయం చేయించండి… వారి భవిష్యత్ చూస్తే మీకే అర్థమవుతుంది అన్నాను. వ్యవసాయదారుడు వ్యవసాయంలోనే ఉండిపోకుండా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు పోవాలి. అందుకు ఉదాహరణ నేనే.
మా నాన్న నన్ను వ్యవసాయం చేసుకోమని అనుంటే రెండు మూడెకరాలు సాగు చేసి, కష్టపడి ఇంకో పదెకరాలు కొనేవాడ్ని. కానీ నేను అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలుగు జాతికి గుర్తింపు తీసుకువచ్చే పరిస్థితికి వచ్చాను. నైపుణ్యం ఆధారంగా చేసుకుంటే అలాంటి అవకాశాలు ఉంటాయని నాడు చెప్పాను’ అన్నారు. టీడీపీ వర్గాల నుంచి చంద్రబాబు వ్యతిరేక ప్రచారాన్ని ఈసారి బలంగా తిప్పికొడుతున్నారు. అంతేకాదు… జగన్ వచ్చి రైతులకు ఏమీ చేయలేదన్నది కూడా జనంలోకి తీసుకెళ్తున్నారు.