కలిమి లేకున్నా బలం ఉండాలనేది సామెత. ఇప్పుడు టీడీపీ విషయంలో ఇది స్పష్టంగా రుజువైందని అంటున్నారు పరిశీలకులు. పార్టీకి అధికారం లేదన్న చింత తప్ప.. నిజానికి టీడీపీ పార్టీకి బలం.. బలగం.. ఎంత ఉందో పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నిరూపిస్తోందని చెబుతున్నారు. జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. ఆదిలో సో.. సో.. గా సాగిందనే వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉంటున్న జిల్లాల్లో 2019లో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొం ది. కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అతిరథ మహారథులు అండగా ఉన్న అనంతపురంలో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. దీంతో ఇక, టీడీపీ పరిస్థితి అయిపోయిందనే కామెంట్లు వినిపిం చాయి. ఇది నిజంగా.. ఇంత బతుకు బతికిన టీడీపీకి ఆత్మహత్యా సదృశమే అయింది. అయితే.. అనూహ్యంగా ఈ ఆటవిడుపు రాజకీయాలను యువగళం.. పెను సంచలనంగా మారి.. పూర్తిగా మార్చివేసింది.
చిత్తూరులో ప్రారంభమైన యాత్ర అనంతపురం చేరుకునే సరికి.. ఇంతింతై.. అన్నట్టుగా జ్వాజ్వల్య మా నంగా పుంజుకుంది. ఇసుక వేస్తే.. రాలనంతగా జనాలు కిక్కిరిసిపోయారు. అడుగుతీసి అడుగు వేసేందు కు చోటు లేనంతగా అనంత ప్రజలు హారతులు పట్టారు. ఇదేమీ.. అవాస్తవమని కొట్టి పారేసేందుకు లేదు. అప్పటి వరకు లూప్ హోల్స్ వెతికిన అధికార పార్టీ మీడియా..అనంత విషయానికి వచ్చే సరికి చూసీ చూడనట్టు వ్యవహరించింది.
కియా పరిశ్రమ వద్ద లోకేష్ తీసిన సెల్ఫీలు.. తదనంతరం ఆయన విసిరిన ఛాలెంజ్‌లతో ప్రారంభమైన అనంతపురం యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి అడుగులు వేసే సరికి.. భారీ ఎత్తున పుంజుకుం ది. కేవలం నారా లోకేష్‌ను చూసేందుకు మాత్రమే కాదు.. పాదయాత్రలో పాదం కలిపేందుకు తండోప తండాలుగా ప్రజలు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఉద్వేగం.. ప్రతి అడుగులోనూ.. అనంత కోటి ఆశలు.. ప్రజ్వరిల్లాయి. నారాలోకేష్ చేస్తున్న పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. దీనిని చూసిన వారు ఇదీ.. టీడీపీ.. బలం.. బలగం అంటూ.. జబ్బలు చరుచుకోవడంలో ఆశ్చర్యం అనిపించలేదు..!
నాయకుడు, సేవకుడు.. మన రాష్ట్రానికి రక్షకుడు..#NaraLokesh #YuvaGalamPadayatra #Yuvagalam pic.twitter.com/gz1I7ExPzJ
— YuvaGalam (@yuvagalam) April 14, 2023