అందుకే అంటారు నోటి నుంచి వచ్చే మాటల్ని జాగ్రత్తగా వచ్చేలా చూసుకోవాలి. ఎప్పటికి సరిపోయే మాటలు అప్పటికి చెప్పటం వరకు బాగానే ఉన్నా.. తర్వాతి రోజుల్లో తమ నోటి నుంచి మాటలకు సమాధానాలు చెప్పాలి ఉంటుంది. అందునా సెలబ్రిటీలు.. రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధులైతే మరింత ఇబ్బంది తప్పదు. తాజాగా అలాంటి పరిస్థితే ఒకటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది. తాను విపక్ష నేతగా ఉన్న వేళలో కియా పరిశ్రమ వద్ద చేసిన జగన్ ప్రసంగం క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.
దాదాపు ఐదేళ్ల క్రితం కియా పరిశ్రమ కోసం భూముల్ని బలవంతంగా లాగేసుకుంటున్నారని.. కియా ఫేక్ అంటూ చెప్పటమే కాదు.. ఒక్క ఏడాది తట్టుకుంటే.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద పరిశ్రమ అయినా సరే.. తాను వెనక్కి పంపించేస్తానంటూ ఆయన చేసిన ఆవేశపు మాటలు అప్పట్లో వైరల్ గా మారాయి. కియా గురించి.. దాని స్వరూపం.. స్థాయి గురించి పెద్దగా అవగాహన లేని వేళ.. అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యలు కొందరికి నచ్చినా.. ఇప్పుడు అదే వీడియోను చూసినప్పుడు అలా ఎలా మాట్లాడారన్న సందేహం కలుగక మానదు.
తాజాగా పాదయాత్ర చేస్తున్న లోకేశ్.. కియా పరిశ్రమ వద్ద ఒక సెల్ఫీ వీడియోను తీసుకోవటం తెలిసిందే. అప్పట్లో జగన్ రెడ్డి కియా పరిశ్రమ ఫేక్ అని.. బలవంతంగా భూములు తీసుకుంటున్నారని.. ఉద్యోగాలు రావని.. భూముల్ని తిరిగి ఇప్పిస్తానని చెప్పాడని.. ఈ రోజున కియా పరిశ్రమలో పాతిక వేల మందికి ఉపాధిని కల్పిస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు చెప్పు..జగన్ రెడ్డి.. కియా ఫేకా? సమాధానం చెప్పగలవా? అంటూ ప్రశ్నించారు.
లోకేశ్ వీడియో వేళ.. చంద్రబాబు ట్వీట్ తో సూటిగా ప్రశ్నించారు. ‘‘కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్?’’ అంటూ చంద్రబాబు సంధించిన ట్వీట్ ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరి.. చంద్రబాబు సంధించిన ట్వీట్ కు సమాధానం జగన్ చెబుతారా? లేక ఆయన సహచర మంత్రులు చెబుతారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. అదే సమయంలో.. ఎవరినైనా సరే తరిమేస్తా? రానివ్వను.. భూములు లాగసుకుంటామనే కన్నా.. ఇబ్బంది లేకుండా చేస్తాననే నాయకుడి అవసరం ఎంతన్న విషయం నాలుగేళ్ల జగన్ పాలనతో బాగా అర్థమైందన్న మాట వినిపిస్తోంది.
I have a Masters Degree in Biotechnology from Pune University
Also have a Masters Degree in Business Administration from City University of New York
Can share both certificates publicly
Just Saying ????
— KTR (@KTRBRS) March 31, 2023