బీజేపీ కీలక నాయకురాలు.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పరిస్థితి ఏంటి? ఆమె వచ్చే ఎన్నిక ల్లో ఎలా నెగ్గుకు రాగలరు? వంటి అనేక సందేహాలు ఇప్పుడు తెరమీదికి వస్తున్నాయి. దీనికి కారణం.. విశా ఖలో బీజేపీ పరిస్థితి కొట్టొచ్చినట్టు తేలిపోయింది. విశాఖ ప్రజలు బీజేపీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. ఘోరంగా ఓడిపోయారు.
కనీసం ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇతర జిల్లాల మాట ఎలా ఉన్నా.. విశాఖలో మరింత దారు ణంగా ఆయన పరిస్థితి కనిపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం.. ప్రైవేటీకరణ సెగ జోరుగా కనిపించింది. ఓట ర్లు కూడా ఇదే విషయాన్ని బాహాటంగా చెప్పారు. దీనికితోడు విశాఖలో మెట్రో ఏర్పాటు కూడా ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది. ఈ ప్రభావం కూడా.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాధవ్ పై స్పష్టంగా కనిపించింది.
ఇలాంటి చోట.. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని పురందేశ్వరి.. భావిస్తున్నారు. ఆమె ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకోకూడదని భావించే వారిలో ఆమె కూడా ఉన్నారనేది కమ లం పార్టీ నేతల వాదన. ఎందుకంటే.. పొత్తు పెట్టుకుంటే.. ఈసీటు ఖచ్చితంగా టీడీపీనే దక్కించు కుంటుంది. దీంతో పురందేశ్వరి ఆశలపై గతంలో నీళ్లు జల్లినట్టు అవుతుంది. అందుకే ఆమె పొత్తుపై ఎక్కడా మాట్లాడడం లేదు.
ఇదిలావుంటే.. పొత్తులు లేకపోయినా.. ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసినా.. గెలిచే పరిస్థితి కనిపించడం లేదనేది తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్‌తో తేలిపోయిందని అం టున్నారు పరిశీలకులు. మాధవ్ లాంటి పరిస్థితే.. పురందేశ్వరికి వచ్చినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పురందేశ్వరి పరిస్థితి డోలాయమానంలో పడినట్టు అయింది. మరి ఆమె ఏం చేస్తారో చూడాలి. విశాఖనుకాదంటే.. విజయాడ బలమైన నియోజకవర్గం. కానీ, ఇక్కడా ఆమెకు అంత సీన్ లేదు. మరి ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చూడాలి.