తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆలోచన మేరకు ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా డాక్టర్ రవి వేమూరి ఆధ్వర్యంలో వివిధ రకాల ట్రైనింగ్ క్లాసులు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా యూఎస్ఏ కి చెందిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ లో స్పెషలైజేడ్ అయిన నార్మ్ సాఫ్ట్ కంపెనీ మంగళగిరి కేంద్రంగా చేస్తున్న ఇండియా బ్రాంచ్ లో ఎన్నారై టిడిపి సెల్ లో శిక్షణ పొందిన ఎనిమిది మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు పొందారు.
వీరందరికీ మార్చి 10వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రైనర్ మాధవి, ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్లు K బుచ్చి రాంప్రసాద్ మరియు చప్పిడి రాజశేఖర్, నార్మ్ సాఫ్ట్ కంట్రీ హెడ్ కరుణాకర్ రెడ్డి, ఐటి హెడ్ కిరణ్ పాల్గొన్నారు.
నార్మ్ సాప్ట్ లో 120 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు
యూఎస్ లోని ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న నార్మ్ సాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ఏపీ ఎన్నార్టీ ద్వారా 2018 లో మంగళగిరి ఎన్ ఆర్ టి టెక్ పార్క్ లో ఈ కంపెనీ సీఈవో K. శ్రీధర్ నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించారు.
నేడు 250 మంది కి పైగా మంగళగిరి మరియు హైదరాబాద్ బ్రాంచ్ లలో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం వీరు డిగ్రీ చదువుకున్న వారికి 120 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
వీరందరికీ ఎన్నారై టిడిపి సెల్ ద్వారా కమ్యూనికేషన్లో శిక్షణ ఉచితంగా ఇచ్చిన తర్వాత ఈ కంపెనీలో ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది.
ఆసక్తి గలవారు వెంటనే ఎన్నారై టిడిపి సెల్ వెబ్సైట్లో www.nritdp.com లో రిజిస్టర్ చేసుకొని లేదా తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్ లోని ఎన్నారై టిడిపి వారిని నేరుగా కానీ సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.