గెలుపు మీద ధీమా ఉన్నప్పుడు.. తాము కోరినట్లే బంతులు వేయాలని బౌలర్ ను బ్యాట్స్ మెన్ అడిగితే ఎలా ఉంటుంది? నాకు నూటికి నూరు మార్కులు వస్తాయి.. కాకుంటే నేను అడిగిన ప్రశ్నలే పరీక్షలో ఇవ్వాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు కూడా అలానే ఉంది. గెలుపు మీద ధీమా ఉన్నప్పుడు.. తాము ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకం ఉన్నప్పుడు.. ఎదుటోడు ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం ఏముంది? అన్నది ప్రశ్న.
దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని ధీమా వైఎస్ జగన్ సొంతమని చెప్పాలి. ఢిల్లీలో చారిత్రక విజయాన్ని సాధించిన ఆమ్ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం.. తాను సాధించిన విజయాన్ని చూపిస్తూ.. జగన్ మాదిరి మాట్లాడలేదేమో.
రాజకీయాల్లో ఎవరూ కూడా ఉన్న సీట్లు మొత్తంలో తామే గెలుస్తామన్న మాటను మాట్లాడరు. ఆ మాటకు వస్తే ప్రజాస్వామిక వాదులు ఎదరైనా సరే.. బలమైన విపక్షం ఉండాలనే కోరుకుంటారు తప్పించి.. గుండుగుత్తుగా ఒక పార్టీనే విజయం సాధించాలని అస్సలు అనుకోరు. ఒకవేళ.. అలా కోరుకుంటే అది ప్రజాస్వామ్యానికి దెబ్బ తీయటమే అవుతుంది తప్పించి మరొకటి లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి మాటలు చెప్పినంతనే.. ఏవో ముద్రలు వేసే వారురెఢీగా ఉంటారు. అలాంటి వారికి చెప్పేదేమంటే.. ఒకవేళ మీరు అలానే అనుకుంటే.. వేరే పార్టీల తరఫున వకల్తా పుచ్చుకొని ఇలాంటి వాదనలు వినిపిస్తుననట్లుగా మీరు భావిస్తే.. ఇక్కడ మేం చెప్పేదొక్కటే. జగన్ మాత్రమే కాదు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎవరైనా సరే.. ఉన్న 175 స్థానాల్లో తాము గెలవాలని కోరుకోవటం తప్పే అవుతుంది. కారణం.. ప్రజాస్వామ్యంలో అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలి. అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది.
అలాంటప్పుడు విపక్షం ఉండాలని కోరుకోవాలే తప్పించి.. అందుకు భిన్నంగా వాళ్లు ఎవరూ వద్దు.. అంతా.. అన్నింటా నేనే ఉండాలని కోరుకోవటం ఏమిటి? అది కూడా.. తాను చెప్పిన కండీషన్లకు తగ్గట్లే వ్యవహరించి ఎన్నికల గోదాలోకి దిగాలనుకోవటంలో లాజిక్ ఏమిటో అర్థం కాదు.
ఓటమి భయం లేనప్పుడు.. గెలుపు ధీమా భారీగా ఉన్నప్పుడు తమ ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలతో ఎన్నికలకు వస్తారన్న దానితో జగన్ కు పనేమిటి? ఒంటరిగా పోటీ చేయాలని చెబుతున్న జగన్.. అక్కడితో ఆగితే బాగుండు. అంతకు మించి.. మరో అడుగు ముందుకు వేసి.. గెలిచేందుకు మీరు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారు ఓపెన్ గా చెప్పేసి.. దమ్ముగా పోటీకి దిగాలన్న కండీషన్ పెట్టలేదు.
ఒంటరిగా పోటీకి దిగాలని కోరుకుంటున్న జగన్.. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో ఎందుకు బరిలోకి దిగినట్లు? ఆ సందర్భంగా తనకు ఆయన అందించిన సహకారం గురించి ఓపెన్ గా మాట్లాడే దమ్ము ధైర్యం జగన్ కు ఉందా? ఉంటే.. జరిగింది జరిగినట్లుగా చెప్పేసే ధైర్యం జగన్ కు ఉందా? అన్న ప్రశ్న పలువురు సంధిస్తున్నారు.
వామ్మో జగన్… తెనాలి జైలు రెడ్డి సభ నుండి గోడలు దూకి పారిపోతున్న జనాలు…
జైలు రెడ్డి స్పీచ్ అలా మెదలు.. జనాలు ఇలా పరుగులు…. @realyssharmila @iTDP_Official @JaiTDP @ysjagan ???????????? pic.twitter.com/qMZiaXHjkP
— Swathi Reddy (@Swathireddytdp) February 28, 2023
తెనాలి సాక్షిగా ముఖ్యమంత్రి @ysjagan గారు చేసిన "జగన్మాయ", ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న వై.యస్.ఆర్. విద్యుత్ వాతలు, వై.యస్. వివేకానంద రెడ్డి గారి కేసులో అసలు నిన్న జరిగింది ఏంటి మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ".
Watch here -> https://t.co/62hhxn9l14 pic.twitter.com/AHWa0DHors— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) February 28, 2023