ఏపీలో సీఎం జగన్ పర్యటన అంటే.. చాలు ఆయా ప్రాంతాల ప్రజలు హడలి పోతున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి వస్తున్నారం టే.. ప్రజలు తండోపతండాలుగా వస్తారు. వారి సమస్యలు చెప్పుకొనేందుకు రెడీ అవుతారు. కనీసం ముఖ్యమంత్రి చొరవతో అయి నా.. ఆయా సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తారు. కానీ, ఏపీలో మాత్రం చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సీఎం జగన్ వస్తున్నాడంటే.. జనాలు హడిలిపోయి.. హయ్యబాబోయ్.. అనేస్తున్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడ పర్యటించినా అదేపరిస్థితి.
తాజాగా గుంటూరు జిల్లాలో మంగళవారం సీఎం జగన్ పర్యటన ఉంది. దీంతో అధికారులు రోడ్డు సైడు చిరు వ్యాపారులను రెండురోజుల ముందే.. దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. తోపుడు బండ్లను బలవంతంగా మార్కెట్ యార్డుకు తరలించేశారు. ఇక, రోడ్ల వెంట ఉన్న చెట్లను నరకేశారు. భద్రత పేరుతో, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని చెప్తూ ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న వృక్షాలను నరికివేశారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా అధికారులు పచ్చని చెట్లను నరికేశారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదేకాకుండా.. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందుకోసం తెనాలిలో పలు కార్యక్రమాలను నిర్వహించనుండగా.. ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.
రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని.. తెనాలిలోని మార్కెట్ యార్డులో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి సభ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం చేసిన ఏర్పాట్లలో అలంకారం కోసం మొక్కజొన్న కంకులకు పార్టీ రంగులను వేశారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి రేపు ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు.. కూడా ఇలానే చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
తెనాలి జలగన్నా మీటింగ్ కు మెుక్క జొన్న కండెలకు రంగులు … pic.twitter.com/32Fs5bzIAe
— Chakri Movva (@ChakriMovva) February 27, 2023
తాడేపల్లి నుండి తెనాలి కి హెలికాప్టర్ ????????
నెలకి ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నాడుగా… ఆ మాత్రం జల్సా చేస్తాడు లే ???????? https://t.co/ph1c8fdZxa
— Simha Swapnam (@simha_swapnam) February 27, 2023
https://twitter.com/DevineniBharat_/status/1630174992909606913