ఈ ఏడాది నవంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందుగానే అసెంబ్లీని రద్దు చేసే యోచన కూడా ఉన్నట్టు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది ఎలా ఉన్నప్పటికీ.. షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ నిలుస్తుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నేత.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయా? అనేది కూడా హాట్ టాపిక్గామారింది.
దీనికికూడా కారణాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో బీఆర్ ఎస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు వున్నా యి. ఈ విషయాన్ని కేసీఆర్ ఇప్పటికే గ్రహించారు. అయితే.. నాయకులను మార్చాలనే ప్రయత్నం చేస్తు న్నా.. వారు రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగితే ఏంటి పరిస్థితి? అనేది కూడా చర్చకు దారితీస్తోంది. అలాగని వారికే టికెట్ ఇస్తే.. ఓటమి ఖాయంగా నూ కనిపిస్తోంది. ఇక, కాంగ్రెస్ కొన్ని ప్రాంతాల్లో పుంజుకుం ది. దీంతో గతానికి భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని సీట్లు పెరుగుతాయని తెలుస్తోంది.
అయితే,అధికారంలోకి వచ్చేస్థాయి మాత్రం కాంగ్రెస్కు ఇంకాలేదని కొందరు బల్లగుద్ది మరీ చెబుతుండ డం చర్చకు దారితీస్తోంది. ఇక, బీజేపీ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్.. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి ఉన్న సభ్యు ల సంఖ్య రెండెంకెలకు చేరుతుంది. అయితే.. 10-12 మధ్యలోనే ఉంటుందని ఒక అంచనాగా ఉంది. మరోవైపు.. ఇతర పార్టీ పార్టీలను చూసుకుంటే.. వైఎస్సార్ టీపీ ఓట్లు చీలుస్తుందని తెలుస్తోంది. దీనిని ముందుగానే కొందరు అంచనా వేస్తున్నారు.
జనసేన పరిస్థితి కూడా అంతే అంటున్నారు. అయితే.. బీఆర్ ఎస్తో చేతులు కలిపే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. తెలంగాణలో ఓట్లు చీలిపోయే పరిస్థితి ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏ పార్టీకి కూడా మేజిక్ ఫిగర్ అయిన.. 60 స్థానాలు దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. ఏయే పార్టీకి ఎన్నెన్ని స్థానాలు దక్కుతాయంటే..
బీఆర్ ఎస్ + కమ్యూనిస్టుల+ జనసేన = 52-58
బీజేపీ = 9-12
కాంగ్రెస్ = 32-38
ఎంఐఎం = 7-10
ఇతర పార్టీలు = 1-2