వెనిగండ్ల రాము లక్ష్యాలకు అనుగుణంగా ఫౌండేషన్ కార్యకలాపాలు
రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు
వెనిగండ్ల పౌండేషన్ ఆధ్వర్యంలో వీకేఆర్ & వీఎన్‌బీ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు నిర్వహించిన మెగా జాబ్‌మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ మెగా జాబ్ మేళాకు గుడివాడ నియోజకవర్గం నుంచి పదవ తరగతి నుంచి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన 1750 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 1150 మంది వివిధ కంపెనీలకు ఎంపిక అయ్యారు.
ఫాక్స్‌కాన్ గ్రూప్, కియా ఇండియా గ్రూప్, ఐసీఐసీఐ, గ్రీన్ టెక్, డిక్సన్ ప్రైవేట్ లిమిటెడ్, టీసీఎల్, హీరో మోటో కార్పొరేషన్, వరుణ్ మోటార్స్, కల్లం టెక్స్ టైల్స్, శ్రీరామ్ చిట్స్ సహా 50 కంపెనీల తరఫున హాజరైన హెచ్ఆర్ ప్రతినిధులు తమ సంస్థల్లో ఉద్యోగాలకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారని వెనిగండ్ల ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎంపికైన కొందరు అభ్యర్థులకు అక్కడే నియామక పత్రాలను అందజేశారు.
మిగతా ఎంపికైన వారందరికి ఆయా సంస్థల ప్రతినిధులు ఇమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని తెలిపారు.
ఈ జాబ్ మేళాకు మహిళా అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరు కావడం విశేషమని.. మోడ్రన్ గుడివాడ లక్ష్యంగా వెనిగండ్ల రాము పనిచేస్తున్నారని.. నియోజకవర్గం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే గుడివాడ టీడీపీ సీనియర్ నాయకులు వెనిగండ్ల రాము లక్ష్యమని.. అందుకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ఇలాంటి జాబ్‌మేళాలు మరిన్ని నిర్వహిస్తామని వెనిగండ్ల ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ మెగా జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందించడంకోసం 2 హెల్ప్ డెస్క్ లు, రిజిస్ట్రేషన్ల కోసం 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు. చదువు పూర్తి అయినా ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. ఇప్పుడు వెనిగండ్ల రాము తన ఫౌండేషన్ ద్వారా గుడివాడలోనే ఇంతపెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటు చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండా తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారని యువత సంతోషం వ్యక్తం చేశారు.