మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ టు దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటికే స్ట్రీమ్ అయిన అన్ని ఎపిసోడ్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో తాజా ఎపిసోడ్ కు టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 2వతేదీ రాత్రి స్ట్రీమ్ అయింది.
ఈ క్రమంలోనే నిన్న స్ట్రీమ్ అయిన ఈ ఎపిసోడ్ పార్ట్-1 రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగానే ఆ షోలో పవన్ కళ్యాణ్ ను బాలయ్య పలు ప్రశ్నలతో ఇరుకున పడేశారు. పరమేశ్వర…పవరేశ్వరా అంటూ పవన్ ను సంభోదించిన బాలయ్య…పవన్ మేనజాన్ని ప్రత్యక్షంగా చూడాలంటూ పట్టుబట్టడం ఈ ఎపిసోడ్ కే హైలైట్. జీవితంలో తాను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నానని, బ్రహ్మచారిగా ఉండాలనుకున్నానని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కానీ, అన్ని అలా జరిగిపోయాయని అన్నారు. రాజకీయాలలో తనను ఎదుర్కోలేని వారంతా ఈ పెళ్లిళ్ల విషయంలో తన టార్గెట్ చేస్తుంటారని పవన్ అన్నారు. తాను ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, ఒకేసారి ముగ్గురితో కలిసి ఉండడం లేదని పవన్ క్లారిటీనిచ్చారు. ఒకరితో తనకు కుదరదు అనుకున్నప్పుడు విడాకులు ఇచ్చి చట్టబద్ధంగా వేరే పెళ్లి చేసుకున్నానని, వ్యామోహంతో కాదని పవన్ అన్నారు. తనను టార్గెట్ చేయడానికి వేరే అంశం లేక ఈ పెళ్లిళ్ల మ్యాటర్ తెస్తున్నారని, వారు మాత్రం ఏం చేస్తారు పాపం అంటూ పవన్ వైసీపీ నేతలకు చురకలంటించారు.
వైసిపి నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించేందుకు తనకు సంస్కారం, సభ్యత అడ్డొస్తున్నాయని చెప్పుకొచ్చారు. అందుకే, తన పని తాను చేసుకుంటూ పోతానని అన్నారు. ఈ క్లారిటీ విన్న తర్వాత పవన్ పెళ్లిళ్ల గురించి ఎవరైనా మాట్లాడితే అంటూ బాలయ్య ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.