రోడ్ షోలు, ర్యాలీలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలకు అసలు నచ్చలేదు. ప్రజలు కూడా దీనిని విమర్శిస్తున్నారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని, వైసీపీ భయాన్ని నిలదీస్తున్నారు. తాజాగా ఇప్పుడు దీనిపై పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన అధినేత నాగబాబు కొత్త జీవో విషయమై జగన్ పై దుమ్మెత్తిపోశారు.
“జగన్ రాజ్యాన్ని పాలిస్తున్నాడని అనుకుంటున్నాడా? అతను ప్రజాస్వామ్యంలో ఉన్నాడన్న విషయం అతను దానిని మరచిపోతున్నాడు. రోడ్ షోలు, ర్యాలీలను నిషేధించే అధికారం ఆయనకు లేదు. ప్రతిపక్షాలు ప్రజలను కలవడానికి ఇదే ఏకైక మార్గం. టీడీపీ ప్రభుత్వం పబ్లిక్ షోలను నిషేధించి ఉంటే ఆయన పాదయాత్ర చేసి ఉండేవారా?’’ అని నాగబాబు నిలదీశారు.
చంద్రబాబు సభలో జరిగిన దుర్ఘటనపై నాగబాబు మాట్లాడుతూ “చంద్రబాబు బహిరంగ సభల్లో జరిగినవి దురదృష్టకరం. వాటిని అడ్డం పెట్టుకుని జగన్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తానంంటే కుదరదు. నిజానికి, చంద్రబాబు పబ్లిక్ షోలో కొందరి ప్రాణాలను బలిగొన్న రెండో ఘటనలో కచ్చితంగా కుట్ర ఉందని నేను అనుమానిస్తున్నాన. మేము దానిని మరింత ఆరా తీస్తాం అని నాగబాబు సంచలన వ్యాఖ్యలు.
Koja maatalu vadhu తొక్కిసలాటలో కుట్ర ఉంది: నాగబాబుhttps://t.co/SPQ5Wr2yLL pic.twitter.com/q3b9n9IU0E
— Rajesh1980 (@Rajesh19808) January 3, 2023