ప్రధాని నరేంద్ర మోడీ తన కల నెరవేర్చుకున్నారు. సుదీర్ఘమైన, విశాలమైన, అధునాతన వసతులతో కూడిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. జనవరి 26న మోడీ దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలోనే 13 ఎకరాల్లో శోభాయమానంగా నిర్మాణం జరిగింది.
ఇక, ఇది ప్రారంభమైనవెంటనే 29వ తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలి ప్రసంగం చేయనున్నారు. తర్వాత పాత పార్లమెంట్లోనే బడ్జెజ్ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతానికి లోక్ సభ మాత్రమే సిద్ధం కాగా.. రాజ్యసభ తో పాటు పలు విభాగాల్లో పనులు జరుగుతున్నాయి.
Why does India ???????? need new parliament building when #BJP #modiji does not believe in any discussion with opposition parties on Chinese claim of Indian sovereign territory of Arunachal Pradesh as its South Tibet pic.twitter.com/ip8vNhUW6O
— Desi Girl (@DesiGir01446990) December 23, 2022
ఇప్పుడున్న పార్లమెంటును ఏం చేస్తారు?
ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. కొత్త ఢిల్లీ రూపకర్తలు ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్లు ఈ పార్లమెంటును డిజైన్ చేశారు. 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి సుమారు ఆరేళ్లు పట్టింది. రూ. 83 లక్షల వ్యయంతో తయారైన ఈ భవనాన్ని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇది సభ్యులకు సరిపోవడం లేదు. అందుకే ప్రస్తుత పార్లమెంటు భవనం కన్నా నాలుగు రెట్లు పెద్దదైన భవనాన్నినిర్మించారు. ఇక… పాత పార్లమెంటును మ్యూజియం చేయనున్నట్టు తెలుస్తోంది.
విశాలం.. వినూత్నం!
కొత్త పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 971 కోట్ల రూపాయలు కాగా, నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. కొత్త భవనం ప్రస్తుత పార్లమెంటు భవనం కన్నా 17వేల చదరపు మీటర్ల మేర పెద్దదిగా ఉంది.
ఇందులో లోక్సభ సభ్యుల కోసం సుమారు 888 సీట్లు, రాజ్యసభ సభ్యుల కోసం 326 కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. లోక్సభలో ఏక కాలంలో 1,224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుంది. దీంతో మోడీ కొత్త పార్లమెంటురూపశిల్పిగా చరిత్రపుటల్లో రికార్డునమోదు చేయనున్నారు.