ప్లేటు పునుగులు నూట పాతిక రూపాయలా… వామ్మో అంటూ నెటిజన్లు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమత్ర తాజాగా ప్రారంబించిన కాఫీషాప్‌లో ధర ఇది. ఈ హోటల్ ధరల పట్టిక ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. టాలీవుడ్ మిల్క్‌బాయ్ ప్రిన్స్ మహేశ్‌బాబు ప్రొడక్షన్లోనే కాకుండా ఇతర వ్యాపారరంగాల్లోకి ప్రవేశిస్తున్నారు.
ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాలను విస్తరించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమన తన భార్య నమ్రతా ద్వారా ఒక కొత్త కాఫీషాప్ బిజినెస్‌ను స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు అందులో ఉన్న రేట్లు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అని సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోల్స్ నడుస్తున్నాయి.
ముఖ్యంగా సాధారణ టిఫిన్లు మాత్రం ఊహించని రేంజ్ లోనే ఉన్నాయి. రెగ్యులర్ టిఫిన్స్ లలో ఇడ్లీలు అయితే ఒక ప్లేట్ 90 రూపాయలు ఉండగా ఆ తర్వాత వివిధ రకాల ఇడ్లీలు 120 రూపాయల నుంచి 190 వరకు ఉన్నాయ. ఇక మరికొన్ని స్టార్టర్స్ అయితే 390 రేంజ్ లో కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా పునుగులు ఆలూ బజ్జీలు మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా 125 రూపాయల పై గానే ఉండడంతో సోషల్ మీడియాలో మెన్యుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ దగ్గర నమ్రత శిరోద్కర్ ’ప్యాలెస్ హైట్స్‘ అనే మినర్వా కాఫీ షాప్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇందులో ఏషియన్ సినిమాస్ సునీల్ కూడా భాగస్వాములుగా ఉన్నారు. నమ్రత ప్రత్యేకంగా ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ హోటల్‌ను ప్రారంభించారు. ఈ హోటల్‌కు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Glimpse from the Pooja ceremony of #ANRestaurants – Minerva Coffee Shop ☕️
Grand Opening Tomorrow, 7 AM onwards ❤️????
Superstar @urstrulyMahesh #NamrataMaheshGhattamaneni @AsianSuniel @BharatNarangA #Minerva #PalaceHeights pic.twitter.com/USCpjAVgOe
— Mahesh Babu Space (@SSMBSpace) December 7, 2022
ఇది పేరుకు కాఫీ షాప్ అయినప్పటికీ ఇందులో చైనీస్ ఫుడ్స్ వివిధ రకాల ఇతర ఐటెమ్స్, స్నాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా టిఫిన్స్ స్టాటర్స్ హైలెట్‌గా ఉంటాయట. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతంలో ఈ హోటల్‌ను ఏర్పాటు చేయడంతో అందులో ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఈ హోటల్లో ధరలపై సోషల్ మీడియాలో రకరకలా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఒక్క ప్లేటు పునుగులే 125 రూపాయలకుపైగా ఉంది. బజ్జీలు, మిర్చీ బజ్జీలు కూడా అదేస్థాయి ధర ఉంది. ఒక ప్లేటు సాధారణ ఇడ్లీ 90 రూపాయలుండగా వివిధ రకాల ఇతర ఇడ్లీల ధర 120 రూపాయల నుంచీ 190 రూపాయల వకు ఉంది. మరికొన్ని స్టార్టర్స్ 390 రూపాయల రేంజ్లో కూడా ఉన్నాయట. ఈ రేట్లు చూస్తుంటే ఇది సామాన్యులకు అందుబాటులో ఉండేటటువంటి కాఫీ షాప్లా లేదే అని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు చాలా తెలివిగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు ఏషియన్ సినిమాస్ కూడా స్థాపించారు. అది మంచి ప్రాఫిట్లోకొనసాగుతోంది. ఇప్పుడు ఏషియన్ సునీల్ భాగస్వామ్యంతో నమ్రత ఆధ్వర్యంలో మినర్వా కాఫీ షాప్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు ఈ కాఫీ అవుట్లెట్లను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. మహేశ్‌బాబు కంటే కూడా నమ్రత వ్యాపారాల్లో చాలా తెలివిగా పెట్టుబడులు పెడుతుంటారు అనేది అందరికీ తెలిసిన సంగతే.