ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజాను తనను గూండాలు పెట్టి అక్రమంగా అరెస్టు చేయించారని అన్నారు. నేనిపుడు చెబుతున్నాను… రాసిపెట్టుకోండి, 18 నెలల్లో నేను కూర్చున్న స్టేషన్లోనే రోజాను కూర్చోబెడతాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా అరెస్టుకు మంత్రి రోజాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలే కారణమని కిరణ్ రాయల్ ఆరోపించారు. శుక్రవారం తన ఇంటి వద్ద తనను అరెస్టు చేసిన పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని అన్నారు. పోలీసులు ఉగ్రవాది కంటే హీనంగా తనను ట్రీట్ చేశారని ఆరోపించారు.
అరెస్టు సమయంలో కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ ద్వారా మంత్రి తనతో మాట్లాడారని కిరణ్ తెలిపారు. తనను అవమానించినందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నారని రోజా అన్నట్లు కిరణ్ రాయల్ ఆరోపించారు.
‘నాపై అక్రమంగా కేసు పెట్టారు.. ఏది ఏమైనా నాలుగు రోజులు బెయిల్ లేకుండా కిరణ్ రాయల్ ను జైల్లో పెట్టండి.. మళ్లీ అధికార పార్టీ నేతలు, మంత్రులపై మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు.. నన్ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. అధికార దుర్వినియోగంతోపాటు చట్టాన్ని దుర్వినియోగం చేసింది.. మంత్రి రోజా చెప్పినట్లు చట్టం రాసింది.. ఆమె చెప్పినట్లు సెక్షన్లు పెట్టింది.. అంతా ఆమె కోరుకున్నట్లే జరిగింది’’ అని కిరణ్ అన్నారు.
మా లీగల్ డిపార్ట్ మెంట్ తో మాట్లాడి రోజా గారిపై కేసు పెడతాం. ఆమెపై కోర్టుకు వెళ్తున్నారు. సరిగ్గా 18 నెలల్లో మంత్రి రోజాను అదే స్టేషన్లో కూర్చోబెడతాం.. అని రాయల్ కిరణ్ వ్యాఖ్యానించారు.
తిరుపతి
మంత్రి రోజా కి కిరణ్ రాయల్ కౌంటర్…
కిరణ్ రాయల్ తో తాను మాట్లాడలేదు అన్న రోజా వ్యాఖ్యలకు స్పందించిన కిరణ్ రాయల్
తనతో మాట్లాడిన తేదీ, సమయం చెప్తానని, ఫోన్ కాల్ లిస్ట్ తీయమని చెప్పిన కిరణ్ రాయల్ pic.twitter.com/zS7XQYq2nR
— Akepati Subhashini (@SUBHASHINIjsp) November 13, 2022