అభిమానిస్తే ఆకాశానికి ఎత్తేయటం.. కాస్తంత తేడా వస్తే పాతాళానికి తొక్కేయటం ఎలా అన్న విషయం కేసీఆర్ కు , గులాబీ దళానికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి.
గులాబీ బాస్ కేసీఆర్ తో స్నేహపూర్వకంగా ఉన్నంతవరకు ఎలా ఉంటుంది? కాస్తంత తేడా రాగానే ఆయన మాటలు.. చేతలు ఎంతలా మారిపోతాయో.. ఇప్పటికే పలుమార్లు నిరూపితం కావటం తెలిసిందే.
అలాంటి ఆయనకు.. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య నడుస్తున్న లడాయి గురించి తెలిసిందే. గడిచిన కొంతకాలంగా మోడీని టార్గెట్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ఏ రీతిలో విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. తాము టార్గెట్ చేసిన తెలంగాణకు వచ్చే వేళకు.. ఆయనకు అనూహ్యమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఆ మధ్యన హైదరాబాద్ లోని నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన నరేంద్ర మోడీని ఉద్దేశించి.. నగరంలో పలుచోట్ల వెలిసిన ఫ్లెక్సీలు.. అందులోని నినాదాల గురించి తెలిసిందే. ఆ తర్వాతి కాలంలో వచ్చిన రరెండు సందర్భాల్లోనూ ఆయనకు చిరాకు పుట్టే నినాదాలతో బ్యానర్లు.. ఫ్లెక్సీలు వెలవటం చూసిందే. ఆ సందర్భంగా సాలు మోడీ.. సంపకు మోడీ అంటూ టీఆర్ఎస్.. వారి మద్దతుదారులు ఏర్పాటు చేయటం.. అదో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మరో రెండు రోజుల్లో తెలంగాణ పర్యటనకు రానున్న నరేంద్ర మోడీ ఇరిటేట్ అయ్యే నినాదాన్ని మొదలు పెట్టారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని పలుచోట్ల ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు.. పోస్టర్లు ఏర్పాటు అయ్యాయి. అందులో ప్రముఖంగా.. ‘మోడీ నో ఎంట్రీ’ అంటూ ప్రముఖంగా ప్రచురించిన బ్యానర్లు పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. చేనేత మీద విధించిన 5 శాతం జీఎస్టీని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ ను చేస్తున్నారు.
This is the first time in the history of India that we are seeing such a opposition to PM. Now, Telangana says #GoBackModi #GoBack_Modi pic.twitter.com/gP40Jneb7A
— Nageshwar Rao (@itsmeKNR) November 10, 2022